Asianet News TeluguAsianet News Telugu

శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తా - పొలిటికల్ ఎంట్రీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Kangana Ranaut : పొలిటికల్ ఎంట్రీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

Will contest Lok Sabha elections if Lord Krishna blesses - Kangana Ranaut's sensational comments on political entry..ISR
Author
First Published Nov 3, 2023, 3:58 PM IST

Kangana Ranaut : శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోని  ప్రఖ్యాత శ్రీకృష్ణాలయం ‘ద్వారకాధీష్’లో శుక్రవారం ఉదయం ఆమె పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా ఆమెను ప్రశ్నించింది.

పార్టీ ఆదేశిస్తే కర్ణాటక సీఎం కావడానికి సిద్ధమే - మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే

దానికి ఆమె సమాధానం చెబుతూ.. ‘‘శ్రీ కృష్ణ కీ కృపా రహీ తో లాంగే (శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే నేను పోరాడతాను) అని తెలిపారు. 600 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సాధ్యమైందని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించారు. ‘‘
బీజేపీ ప్రభుత్వ కృషితో 600 ఏళ్ల పోరాటం తర్వాత భారతీయులమైన మనం ఈ రోజును చూడగలుగుతున్నాం. ఎంతో వైభవంగా ఆలయాన్ని నిర్మిస్తాం. సనాతన ధర్మ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేయాలి’’ అని ఆమె అన్నారు.

సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం అవశేషాలను యాత్రికులు సందర్శించే సదుపాయాన్ని కల్పించాలని కంగనా రనౌత్ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ద్వారకా ఒక దివ్య నగరం అని నేనెప్పుడూ చెబుతుంటాను. ఇక్కడ ప్రతిదీ అద్భుతంగా ఉంది. ప్రతి కణంలోనూ ద్వారకాధీష్ ఉంటుంది. ఆయనను చూడగానే నేను ధన్యురాలిని అవుతాను. వీలైనంత వరకు స్వామి వారి దర్శనం కోసం ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంటాను. పని నుంచి క్షణం దొరికితే చాలు ఇక్కడికి వస్తుంటాను.’’ అని ఆమె తెలిపారు. 

దళిత మహిళపై అత్యాచారం.. అనంతరం దారుణ హత్య.. డెడ్ బాడీని ముక్కలు నరికి.. దారుణం..

ఈ మీడియా సమావేశం సందర్భంగా ఆమె దర్శకత్వం వహించి నిర్మిస్తున్న 'ఎమర్జెన్సీ', 'తనూ వెడ్స్ మను పార్ట్ 3' వంటి తన ప్రాజెక్ట్ ల గురించి కూడా కంగనా రనౌత్ మాట్లాడారు. కాగా.. ఆమె ఇటీవల విడుదలైన 'తేజస్' చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios