దళిత మహిళపై అత్యాచారం.. అనంతరం దారుణ హత్య.. డెడ్ బాడీని ముక్కలు నరికి.. దారుణం..
దళిత మహిళపై ఓ దుండగుడు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ ఘటన యూపీలోని బందా జిల్లాలో జరిగింది.
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ దళితపై మహిళపై ఓ దుండుగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఘోరంగా హత్య చేశాడు. తరువాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి తన గదిలో ఉంచాడు. బాధితురాలు కూతురు వెళ్లి చూడగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. బందా జిల్లాలోని గిర్వాన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామంలో 40 ఏళ్ల దళిత మహిళ తన కూతురుతో కలిసి జీవిస్తోంది. ఆమె ఇంటికి సమీపంలోనే రాజ్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి పిండి మిల్లు ఉంది. అయితే మంగళవారం ఆమె ఆ పిండి మిల్లును శుభ్రం చేసేందుకు అతడి ఇంటికి వెళ్లింది.
దీంతో ఆమెపై శుక్లా ఆమెను గదిలోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. అదే సమయంలో తల్లి కోసమని ఆమె కూతురు శుక్లా ఇంటికి వెళ్లింది. అయితే గది లోపలి నుంచి తల్లి అరుపులు వినిపించాయి. తలుపులు తెరిచి చూడటంతో తల్లి డెడ్ బాడీ ముక్కలు ముక్కలుగా నరికి ఉండటంతో షాక్ కు గురయ్యింది.
వెంటనే ఆ యువతి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. వెంటనే వారు చేరుకొని ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రాజ్ కుమార్ శుక్లా, అతని సోదరుడు బావా శుక్లా, రామకృష్ణ శుక్లాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
కాగా.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘బందాలో దళితుళిరాలిపై అత్యాచారం, దారుణ హత్య వార్తలు హృదయాన్ని కలచివేశాయి. ఉత్తర్ ప్రదేశ్ మహిళలు భయపడుతున్నారు. ఆగ్రహంగా కూడా ఉన్నారు’’ అని అన్నారు. అనంతరం ఐఐటీ-బీహెచ్ యూలో విద్యార్థినిని అశ్లీల వీడియోలు తీసి, రికార్డ్ చేసిన ఘటనను కూడా అఖిలేష్ యాదవ్ ప్రస్తావించారు. ‘‘ఐఐటీ- బీహెచ్ యూకు చెందిన ఒక విద్యార్థిని అసభ్యంగా ప్రవర్తించి వీడియో తీసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రతలకు చెంపపెట్టు లాంటిదని. ఇది జీరో టాలరెన్స్ అనే బీజేపీ పెద్ద అబద్ధాన్ని బహిర్గతం చేస్తోంది ఉత్తరప్రదేశ్ మహిళలు బీజేపీ ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. ’’ అని పేర్కొన్నారు. అలాగే ఐఐటీ-బీహెచ్ యూ విద్యార్థులు చేస్తున్న నిరసన వీడియోను ఎస్పీ చీఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.