Asianet News TeluguAsianet News Telugu

సోదరుడితో భార్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, వారిద్దరికీ పెళ్లి చేసిన భర్త...

ఓ మహిళ వావివరసలు.. వయసు తేడాలు మరిచి మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది గమనించిన భర్త వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తరువాత అతని చేసిన పనేంటంటే... 

Wifes extra-marital relationship with brother, husband who caught them red-handed and married in West Bengal
Author
First Published Oct 31, 2022, 7:15 AM IST

పశ్చిమ బెంగాల్ : పెళ్లయిన తర్వాత భార్య అప్పటికే వేరొకరిని  ప్రేమించింది అని  తెలిసిన భర్త.. పెద్ద మనసుతో ఆమెను  ప్రియుడి దగ్గరికి పంపడం, వారిద్దరికీ పెళ్లి చేయించడం.. ఇదో సక్సెస్ ఫుల్ సినిమా ఫార్ములా.. హమ్ దిల్ దే చుకే సనమ్ నుంచి అనేక బాలీవుడ్, టాలీవుడ్.. ఇంకా అనేక భారతీయ భాషల్లో.. ఇదే కథను మార్చి, మార్చి తీసినా ప్రేక్షకులు సక్సెస్ చేశారు. అయితే అది సినిమా కానీ నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతాయా? అంటే అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఘటనే పశ్చిమబెంగాల్ లో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంది.

అయితే, ఆమెకు పెళ్లై 24యేళ్లైంది.. ఆమె కొడుకుకూ పెళ్లైంది. ఆ తరువాత మరిది మీద మనసు పడింది. అది తెలుసుకున్న భర్త.. వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చేసిన పని ఇప్పుడు పశ్చిమబెంగాల్ లో చర్చనీయాంశంగా మారింది.  తన సోదరుడితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న ఓ భర్త వారిద్దరికీ వివాహం చేయించాడు. పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శాంతిపూర్ లో నివసించే ప్రాంతానికి చెందిన దీపావళి డేట్ నాకు 24 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వాడికి 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 

అతనికి వివాహం కూడా జరిగింది.. కోడలు కొన్ని రోజులుగా పుట్టింట్లో ఉంటుంది. అమూల్యా దేబ్ నాథ్ వృత్తి రీత్యా వేరే రాష్ట్రంలో ఉండేవాడు. ఈ క్రమంలో దీపాలీ తన భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. వారు ఏకాంతంగా గడిపే సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సాక్ష్యాలతో సహా గ్రామస్థులకు తెలియజేశారు. దీపాలీకి తన సోదరుడు కిశబ్ కు ఇరుగుపొరుగు సమక్షంలో వివాహం జరిపించాడు.

ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేదు..ప్రభుత్వ అనుమతి లేదు.. అయినా సందర్శకులను ఎలా అనుమతించారు?

ఇదిలా ఉండగా, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో 21 ఏళ్ల యువతిని, ఆమె ప్రేమికుడిని అక్టోబర్ 28న పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు యలహంకకు చెందిన శ్వేత, ఆమె స్నేహితుడు ఏపీలోని పెనుకొండకు చెందిన సురేష్ అలియాస్ మూలి సూరి (25). వీరిద్దరూ కలిసి అక్టోబరు 21న శ్వేత భర్తను హత్య చేశారు. వీరిద్దరూ పెనుకొండకు చెందినవారే కావడంతో శ్వేత, సూరితో ప్రేమలో పడిందని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి వీరింట్లో తెలిసింది. 

కానీ ఆమె తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. 2019లో ఆమెకు బలవంతంగా మేనమామ చంద్రశేఖర్‌తో పెళ్లి చేశారు. కానీ శ్వేత పెళ్లైనా ప్రేమను మరిచిపోలేదు. తన ప్రేమికుడు సురేష్ తో తన అనుబంధాన్ని కొనసాగించింది. ఇది భర్తకు తెలియడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. దీంతో శ్వేత తండ్రి శివప్ప ఆరు నెలల క్రితం యలహంకకు వచ్చాడు.  కూతురు, అల్లుడు చంద్రశేఖర్‌ను తనవెంట ఊరికి తీసుకువెళ్లాడు. అయితే శ్వేత, సూరి తమ సంబంధాన్ని కొనసాగించాలంటే చంద్రశేఖర్‌ను హత్య చేయాలని పథకం పన్నారని పోలీసులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే సూరి కూడా యలహంక వచ్చాడు.

అక్టోబర్ 21వ తేదీ రాత్రి శ్వేతతో కలిసి ఆమె ఇంటి టెర్రస్‌పై కత్తి, ఇనుప రాడ్‌ లతో చంద్రశేఖర్‌పై దాడి చేశారు. తలపై కొట్టి కత్తితో పొడిచి చంపారు. సూరి అక్కడి నుంచి పారిపోగా, శ్వేత ఏమీ ఎరగనట్టు సహాయం కోసం కేకలు వేసింది. ఆమె తండ్రి డాబా మీదకు వెళ్లి చూడగా చంద్రశేఖర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.శివప్ప ఫిర్యాదు మేరకు యలహంక పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఇన్‌స్పెక్టర్ బాలాజీ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. సూరితో శ్వేతకు ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారణకు తీసుకువెళ్లగా ఆమె నేరం అంగీకరించినట్లు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios