Asianet News TeluguAsianet News Telugu

వైఫ్ స్వాప్.. భార్యను మరొకరితో సెక్స్ చేయాలని ఒత్తిడి.. తిరస్కరించడంతో దాడి.. ‘నీకు కల్చర్ తెలీదు’

రాజస్తాన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వైఫ్ స్వాప్‌ గేమ్‌లో పాల్గొనడానికి తన భార్య అంగీకరించడం లేదని తీవ్రంగా దాడి చేశాడు. కొన్ని రోజుల పాటు హోటల్ రూమ్‌లో బంధించి వేధించాడు. ఇందుకు సంబంధించిన కేసు మధ్యప్రదేశ్‌లో నమోదైంది.
 

wife tortured for not agreeing to be part in wife swap game in rajasthan
Author
First Published Oct 17, 2022, 2:09 PM IST

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వైఫ్ స్వాప్ గేమ్‌లో పాలుపంచుకోలేదని భార్యను భర్త తీవ్రంగా కొట్టాడు. తాను మరికొరి భార్యతో సంభోగించాలని, ఆమె భర్తతో తన భార్యను సెక్స్ చేయాలని ఒత్తిడి చేశాడు. కానీ, అందుకు ఆమె ససేమిరా అన్నది. దీంతో నీకు కల్చర్ తెలీదు అంటూ ఆమెను దూషించాడు.ఆపై తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన రాజస్తాన్‌లో బికనీరర్‌లో జరిగింది. కాగా, కేసు మాత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రిజిస్టర్ అయింది.

బాధితురాలి ఫిర్యాదు, ఇతర కథనాల ప్రకారం, ఆమె భర్త బికనీర్‌లోని ఓ 5 స్టార్ హోటల్‌లో మేనేజర్. భర్త పేరు అమ్మర్. తన భార్యను అమ్మర్ హోటల రూమ్‌లో లాక్ చేశాడు. ఫోన్ లాక్కున్నాడు. రెండు రోజుల తర్వాత అమ్మర్ తప్పతాగి మత్తులో ఆమె దగ్గరికి వెళ్లాడు. తన భర్తకు మద్యపానం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, చాలా మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలు, అబ్బాయిలతోనూ సెక్స్ చేయడం ఆయనకు సాధారణమైన విషయాలు అని భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: వైఫ్ స్వాపింగ్... ఒకరి భార్యతో మరొకరు.. పట్టణాల్లో పాకుతున్న ట్రెండ్

వైఫ్ స్వాప్ గేమ్‌లో భాగం కావాలని తన భర్త అడిగినట్టు ఆమె తెలిపారు. కానీ, అందుకు తాను తిరస్కరించినట్టు వివరించారు. ‘నేను ఎప్పుడైతే ఈ వైఫ్ స్వాప్ గేమ్‌లో భాగం కావడానికి తిరస్కరించానో అప్పటి నుంచి నన్ను కొడుతూనే ఉన్నాడు. నన్ను అన్‌కల్చర్డ్ అని పిలిచాడు. నాతోనూ అసహజకర రీతిలో శృంగారం చేశాడు’ అని ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో ఆమె ఎన్నో దెబ్బలు తిన్నదని, చాలా చోట్ల గాయాలు అయ్యాయని, కానీ, ఆ గేమ్‌లో పాల్గొనడానికి మాత్రం అంగీకరించలేదని వివరించారు. 

Also Read: భార్యల మార్పిడి రాకెట్ లో ప్రముఖులు.. వెలుగులోకి సంచలన విషయాలు..

అంతేకాదు, తన అత్త, ఆడబిడ్డలు భర్తతో కలిసి రూ. 50 లక్షల కట్నం కోసం డిమాండ్ చేసేవారని ఆరోపించారు. ఈ వరకట్నం వేధింపుల గురించి ఎన్నిసార్లు చెప్పిన తన అత్త కుటుంబం ఎంతమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. అంతేకాదు, తాను మాడ్రన్‌గా ఉంటానని బ్లేమ్ చేశారని వివరించారు.

ఈ వేధింపులు, దాడుల కొన్ని నెలలపాటు సాగాయని, ఫలితంగా తన ఆరోగ్యం కూడా క్షీణించిందని పేర్కొన్నారు. కొందరు బంధువులు ఆమెను తన తల్లి ఇంటికి తీసుకెళ్లారని, అక్కడే ఆ తర్వాత ఈ ఫిర్యాదు చేసినట్టు వివరించారు. నిందితులపై సెక్షన్ 377, 498ఏ, 323, 506, 34, 3/4 వరకట్న నిషేధం చట్టం కింద కేసు నమోదైనట్టు మహిళా పోలీసు స్టేషన్ ఇంచార్జీ అంజనా ధుర్వే వివరించారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నదని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios