Asianet News TeluguAsianet News Telugu

రూ. కోటి లాటరీ గెలుచుకున్న టీఎంసీ ఎమ్మెల్యే భార్య.. మనీలాండరింగ్ చేశారని బీజేపీ ఆరోపణ

టీఎంసీ ఎమ్మెల్యే భార్య కోటి రూపాయిలు లాటరీ గెలుచుకోవడంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అధికార పార్టీ మనీలాండరింగ్ కు పాల్పడిందని ఆరోపించింది. 

Wife of TMC MLA who won 1 crore of lottery.. BJP accused of money laundering
Author
First Published Oct 29, 2022, 2:10 PM IST

పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య లాటరీ ద్వారా కోటి రూపాయిలు గెలుచుకున్నారు. దీనిపై బీజేపీ ఆరోపణలు గుప్పించింది. రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ లాటరీ ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతోందని అక్కడి ప్రతిపక్ష బీజేపీ నాయకుడు సువేందు అధికారి ట్విట్టర్‌లో ఆరోపించారు.

పంజాబ్‌లాగే గుజరాత్‌లోనూ.. మీకు ఎవరు సీఎం కావాలి?’ ప్రజలను అడిగిన అరవింద్ కేజ్రీవాల్

లాటరీ కంపెనీతో టీఎంసీకి సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ‘‘డియర్ (భైపో) లాటరీ, టీఎంసీకి సంబంధం ఉందని నేను ఎంతో కాలం నుంచి చెబుతున్నారు. డబ్బును లాండరింగ్ చేయడానికి ఇది ఒక సులభమైన మార్గం. సామాన్యులు లాటరీ టిక్కెట్లు కొంటారు. కానీ టీఎంసీ నేతలు బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారు. మొదట అనుబ్రత మోండల్ జాక్‌పాట్ కొట్టారు. ఇప్పుడు టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య కోటి రూపాయలు గెలుచుకున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ విషయంలో తాను హోంమంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశానని సువేందు అధికారి తెలిపారు. బెంగాల్‌లో డియర్ లాటరీకి పెద్ద మార్కెట్ ఉందని, అయితే లాటరీలు అనియంత్రితంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ లాటరీ విజేతలను ప్రకటించడంలో తీవ్ర అవకతవకలు జరిగాయని, అసాంఘిక పద్ధతులను పాటించారని తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన తన లేఖలో ఆరోపించారు.

స్కూల్ కు బంక్ కొట్టి.. విషం తాగిన ముగ్గ‌రు బాలిక‌లు.. ఇద్ద‌రు మృతి !

టీఎంసీపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే వివేక్ గుప్తా స్పందించారు. తన భార్యపై రాజకీయ దాడులు అన్యాయమని, ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. తన భార్యకు వచ్చిన డబ్బుతో ఏం చేస్తుందని పూర్తిగా ఆమె ఇష్టమని అన్నారు. ఆమె స్వచ్ఛంద సంస్థలతో పని చేస్తున్నారని అన్నారు. కాబట్టి ఆ డబ్బును తన భార్య దాతృత్వ కార్యకలాపాలకు కూడా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మాజీ సైనికుడు.. దంపతులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు..

అలాగే అది రిజిస్టర్ లాటరీ కంపెనీ అని, ఇది దేశంలోని ఆర్థిక సంస్థలతో నియంత్రించబడుతుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాగాలాండ్ నడుపుతున్న లాటరీని ప్రభావితం చేసేంత శక్తి తనకు ఉందని తెలియదని సువేందు అధికారి మనీలాండరింగ్ క్లెయిమ్ ను ఎత్తిచూపుతూ వివేక్ గుప్తా విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios