Asianet News TeluguAsianet News Telugu

బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మాజీ సైనికుడు.. దంపతులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు..

ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మాజీ సైనికుడికి, శవాన్ని దాచేందుకు సాయం చేసిన ఆయన భార్యకు కోర్టు శిక్ష విధించింది. వారిద్దరికీ యవజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ మహిళా కోర్టు తీర్పు వెలువరించింది. 

An ex-soldier who raped and killed a girl. The court sentenced the couple to life imprisonment.
Author
First Published Oct 29, 2022, 1:05 PM IST

అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ మాజీ సైనికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని మాయం చేసేందుకు తన భార్య సాయం కోరాడు. ఇద్దరు కలిసి శవాన్ని కనిపించకుండా చేసేందుకు ప్రయత్నించారు. కానీ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2019లో జరిగింది. తాజాగా ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. దంపతుల ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

రాజస్తాన్‌లో అప్పులు చెల్లించలేని వారి మైనర్ కూతుళ్ల వేలం.. మహిళా కమిషన్ల ఆగ్రహం.. సీఎం గెహ్లాట్ ఏమన్నారంటే?

వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని  అన్ననూర్ ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల మాజీ సైనికుడు సుందరం, 58 ఏళ్ల రాజమ్మాళ్ దంపతులు. వీరిద్దరూ తిరువళ్లూరు సమీపంలో నివసించేవారు. అయితే 2019 సంవత్సరం జూన్ నెలలో సుందరం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల పాపను లైంగికంగా వేధించాడు. అతడి ఇంట్లో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో పాప కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేశాడు. 

భార్య సాయంతో మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కారు. అనంతరం ఆ సంచిని ఓ మూలన పెట్టారు. కొంత సమయం తరువాత ఆ చిన్నారి తల్లిదండ్రులు పాపను వెతుక్కుంటూ సుందరం ఇంటికి వచ్చారు. కానీ ఆ దంపతులు వారికి అబద్దం చెప్పారు. పాప తమ ఇంటికి రాలేదని అన్నారు. సుందరం కూడా కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారిని వెతికారు. ఏమీ తెలియనట్టు నటించారు.

కోయంబత్తూరులో కారు బాంబు పేలుడులో వెలుగుచూసిన‌ సంచ‌ల‌న విష‌యాలు !

అయితే బాధిత కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వెళ్లాడు. మృతదేహాన్ని ఆ ఇంట్లో బకెట్లో పడేశాడు. అనంతరం కుటుంబ సభ్యులు దానిని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. 2019 జూన్ 28వ తేదీన ఈ జంటను అరెస్టు చేశారు. అయితే ఐదు నెలల తర్వాత వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. 

అప్పటి నుంచి ఈ కేసులో వాదనలు కొనసాగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇద్దరు దంపతులను తిరువళ్లూరు మహిళా కోర్టు గురువారం దోషులుగా తేల్చింది. సుందరంకు, రాజమ్మాళ్ కు జీవిత ఖైదు విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.22 వేలు జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల జరిమానా విధించాలని ఆదేశించింది.  కాగా.. ఈ తీర్పు వెలువరించిన తరువాత కోర్టులో సుందరం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. దీనిని పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు.

దారుణం.. తాగేందుకు డబ్బులివ్వలేదని కన్నతల్లినే కడతేర్చిన తనయుడు.. ఎక్కడంటే ?

సుందరం కోర్టుకు హాజరయ్యే ముందు తన దుస్తుల్లో ఎవరికీ కనిపించకుండా ఒక చిన్న కత్తిని తీసుకొచ్చారు. అయితే పోలీసులు అతడిని దుస్తులను పరిశీలించినప్పుడు కత్తిని గుర్తించారు. దీంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. తుది తీర్పు తరువాత ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అందుకే కత్తిని తీసుకొచ్చానని అతడు పోలీసులకు వివరించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios