Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ కు బంక్ కొట్టి.. విషం తాగిన ముగ్గ‌రు బాలిక‌లు.. ఇద్ద‌రు మృతి !

Indore: తన ప్రియుడు తనతో మాట్లాడకపోవడంతో ముగ్గురిలో ఒక‌రు ఆత్మహత్య చేసుకోవడానికి విషం తీసుకున్నారు. అలాగే, కుటుంబ కలహాల కారణంగా మరొకరు విషం తాగారు. త‌న ఇద్ద‌రు స్నేహితులు విషం తీసుకోవ‌డంతో తాను కూడా అదే పనిచేశాన‌ని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలిక చెప్పింది. 
 

Madhya Pradesh: Three girls were poisoned indoors after skipping school.. Two died!
Author
First Published Oct 29, 2022, 1:33 PM IST

Madhya Pradesh: స్కూల్ కు డుమ్మాకొట్టి.. త‌న ప్రియుడిని క‌ల‌వ‌డానికి వెళ్ల‌గా.. అత‌ను త‌న‌తో మాట్లాడ‌లేద‌ని విషం తాగింది ఓ బాలిక‌. త‌న‌తో పాటు ఇద్ద‌రు స్నేహితుల్లో ఒక‌రు కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా విషం తీసుకున్నారు. త‌న ఇద్ద‌రు స్నేహితులు ప్రాణాలు తీసుకోవ‌డానికి విషం తీసుకోవ‌డంతో మూడో బాలిక కూడా విషం తీసుకుంది. వీరిలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, ఒక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్లోని అష్టా పట్టణానికి చెందిన ముగ్గురు 16 ఏళ్ల బాలికలు శుక్రవారం పాఠశాలకు వెళ్ల‌కుండా డుమ్మాకొట్టారు. వారుంటున్న నివాస ప్రాంతానికి 120 కిలోమీటర్ల దూరంలోని ఇండోర్ ముగ్గురు క‌లిసి బస్సులో వెళ్లారు. అయితే, వారిలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అయితే, ఈ అనుమాన‌స్ప‌ద ఘ‌ట‌న క్ర‌మంలో ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు స్పృహలో ఉన్న ఒక అమ్మాయితో మాట్లాడిన తరువాత పోలీసులు ఈ సంఘటన వివ‌రాలు తెలుసుకుని షాక్ అయ్యారు. ముగ్గురు బాలికల్లో ఒకరు తన ప్రియుడిని కలవడానికి వచ్చారనీ, ఆమెను కలవడానికి నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె విషం తాగార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌నో ముగ్గురు స్నేహితులు క‌లిసి విషాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు. 

"ఈ ముగ్గురు అమ్మాయిలు స్కూల్ కు డుమ్మాకొట్టి ఇండోర్ కు వచ్చిన తర్వాత వారు కాసేపు అటూ ఇటూ తిరుగుతూ భన్వర్ కువాన్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రి సమీపంలోని తోటలో విషం తాగారు. వారిని స్థానికులు ప్ర‌యివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిని ప‌రిస్థితిని గ‌మ‌నించి వెంట‌నే ఎంవై ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు" అని అదనపు డీసీపీ ప్రశాంత్ చౌబే తెలిపారు. "ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చిన‌ప్పుడు స్పృహలో ఉన్న ఒక అమ్మాయి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. తన ప్రియుడు తనతో మాట్లాడకపోవడం వల్ల వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాల కారణంగా మరొకరు విషం తాగారని ఆమె తెలిపింది. తన స్నేహితులిద్దరూ విషం తీసుకుంటుండటం వల్ల, ఆమె కూడా అలా చేసిందని మూడో వ్యక్తి చెప్పింది" అని చౌబే చెప్పారు.

బాలికలు అష్టా ప్రాంతంలోనే విషాన్ని కొనుగోలు చేశార‌నీ, ఇండోర్ లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ఏడీసీపీ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన స‌మాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఇండోర్ చేరుకున్నారు. వారి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తామని పోలీసులు చెప్పారు. అమ్మాయిల నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకోలేద‌ని చౌబే తెలిపారు.

జార్ఖండ్ లో షాకింగ్ ఘ‌ట‌న 

జార్ఖండ్ లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గురువారం గిరిదిహ్‌లోని బాగోదర్ బ్లాక్‌లో బోకరోల్‌లోని ఒక ప్ర‌యివేటు పాఠశాలలో పదో తరగతి విద్యార్థి తన పాఠశాల ఉపాధ్యాయుల మందలింపుతో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రాకేష్ కుమార్ మహ్తో (15) బాగోదర్‌లోని దొండ్లో గ్రామ నివాసి.  నెహ్రూ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. "అతను గురువారం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్ళాడు, కాని త్వరగా ఇంటికి తిరిగి వచ్చాడు. స్కూల్ అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చినందుకు తనను కొట్టారనీ, ఇంటికి తిరిగి వెళ్లిపోవాల‌ని పేర్కొన్నార‌ని చెప్పారు. సాయంత్రం, అతను తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు"   అని మృతుని సోదరుడు దుగాలాల్ మహతో తెలిపారు. బాగోదర్ ఎస్‌డీపీవో నౌషాద్ ఆలం మాట్లాడుతూ మృతుడి గది నుండి మూడు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, అందులో పాఠశాల యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios