Asianet News TeluguAsianet News Telugu

మాందాసర్ రేప్: ఇద్దరు నిందితులకు ఉరి, 2 నెలల్లో తీర్పు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందాసర్‌లో 8 ఏళ్ల బాలికపై  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఇద్దరికి  ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండు మాసాల్లోనే ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరిచింది.

2 Men Get Death For Mandsaur Child's Rape, Trial Done In Under 2 Months
Author
Bhopal, First Published Aug 21, 2018, 4:10 PM IST

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందాసర్‌లో 8 ఏళ్ల బాలికపై  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఇద్దరికి  ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండు మాసాల్లోనే ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరిచింది.

ఈ ఏడాది జూన్ 26వ తేదీన రెండో తరగతి చదువుకొనే బాలిక స్కూల్ బయట నిలబడి ఉంది. స్కూల్ వేళలు ముగిసిన తర్వాత తల్లిదండ్రుల కోసం  ఆ బాలిక ఎదురుచూస్తోంది.

ఆ సమయంలో ఆసిఫ్, ఇర్ఫాన్ అనే ఇద్దరు దుండగులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ బాలిక గొంతుకోశారు. అయితే బాలిక మెడపై ప్రైవేట్ బాగాలపై తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఈ ఇద్దరు నిందితులను  24 గంటల్లోపుగానే అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం విమర్శలు ఎక్కుపెట్టింది.

గత నెలలో సిట్ గ్యాంగ్‌రేప్ పై 500 పేజీల చార్జీషీట్‌ను  ఇద్దరిపై దాఖలు చేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష వేయాలని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడ డిమాండ్ చేశారు. 

ఈ కేసును త్వరితగతిన విచారణ చేసి నిందితులను శిక్షించాలని చీఫ్ జస్టిస్ కు అప్పట్లో చౌహాన్ లేఖ రాశారు.ఈ కేసును రెండు నెలల్లో విచారించి నిందితులకు  మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం నాడు ఉరిశిక్షను విధిస్తూ  తీర్పు వెలువరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios