Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య , పిల్లలు సహా 15 మందికి పాజిటివ్..

Jharkhand CM Hemant Soren: సామాన్యుల నుంచి ప్ర‌ముఖులు, ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ర‌కు ఎవ‌రినీ క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా వైర‌స్ సోకింది. 
 

Wife kids of Hemant Soren among 15 to contract Covid at Jharkhand CMs house
Author
Hyderabad, First Published Jan 9, 2022, 11:06 AM IST

Jharkhand CM Hemant Soren: క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దేశంలో ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత ఈ మ‌హమ్మారి బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. సామాన్యుల నుంచి ప్ర‌ముఖులు, ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ర‌కు ఎవ‌రినీ క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో Coronavirus కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా వైర‌స్ సోకింది. అయితే, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు ప్ర‌స్తుతం నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్‌గా వ‌చ్చింద‌ని అధికారులు పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ముఖ్యమంత్రి నివాసంలో 62 మందికి  క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌నీ, ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌కు వ‌చ్చిన రిపోర్టుల్లో 15 మందికి Coronavirus సోకింద‌ని రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ఇప్ప‌టివ‌ర‌కు 24 మంది క‌రోనా ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన రిపోర్టులు వ‌చ్చాయ‌ని వెల్ల‌డించారు. ఇందులో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

ప్ర‌స్తుతం రిపోర్టులు అందిన క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిలో ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ము ఉన్నారని రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. అయితే, వీరికి స్వ‌ల్పంగానే Coronavirus ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని  తెలిపారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారంద‌రూ కూడా  ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ ఉన్నార‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బ‌న్నా గుప్తా సైతం క‌రోనా బారిన‌ప‌డ్డారు. స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో Coronavirus ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం తాను  జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో క్వారంటైన్ ఉన్నాన‌ని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. జార్ఖండ్‌లో క‌రోనా కేసులు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 3,74,000 కరోనా కేసులు నమోదు కాగా.. 5,164 మంది మరణించారు. 347,866 ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,098 యాక్టివ్ కేసులున్నాయి.

ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. నిత్యం ల‌క్ష‌కు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 మందికి Coronavirus సోకింది. Covid-19 సేకండ్ వేవ్  స‌మ‌యంలో 2021 మే 30న చివరిసారిగా లక్షన్నర కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలోనే శనివారం రోజువారీ Coronavirus కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,55,28,004 పెరిగింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ.. 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 31 నాటికి లక్ష ఉన్న Coronavirus యాక్టివ్ కేసులు.. ప్రస్తుతం ఆరు లక్షలకు చేరువ‌య్యాయి. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు 5,90,611గా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో 40,863 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 3,44,53,603కు పెరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios