శృంగారం విషయమై గొడవ.. బావిలో దూకిన మహిళను కాపాడిన భర్త.. బయటకు తీసి మళ్లీ చంపేసిన వైనం
భార్య భర్తలిద్దరూ సోమవారం రాత్రి మద్యం సేవించి బెడ్ పై పడుకున్నారు. తనతో సంభోగించాలని భార్యను కోరాడు. ఆమె తిరస్కరించడంతో గొడవ జరిగింది. అది తీవ్రం కావడంతో భార్య బావిలో దూకింది. భర్త ఆమెను కాపాడి బయటకు తీసుకువచ్చాడు. కానీ, మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆమె ప్రైవేట్ పార్టులపై దాడి చేసి భార్యను చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లో చోటుచేసుకుంది.
రాయ్‌గడ్: ఛత్తీస్‌గడ్‌లో ఓ అవాంఛనీయ ఘటన జరిగింది. సెక్స్ విషయమై భార్య, భర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత భార్య బావిలో దూకింది. భర్త ఆ బావిలో దూకి ఆమెను రక్షించగలిగాడు. యబటకు తీసుకువచ్చాడు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ గొడవ జరిగింది. అప్పుడు భర్తనే ఆమె ప్రైవేట్ పార్టులపై దాడి చేసి చంపేశాడు. జష్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
శంకర్ రామ్, ఆశా భాయిలు దంపతులు. సోమవారం రాత్రి వారిద్దరూ మద్యం సేవించారు. ఆ తర్వాత పడుకున్నారు. అప్పుడు తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యను భర్త కోరాడు. శంకర్‌తో సెక్స్ చేయడాన్ని ఆశా తిరస్కరించింది. అప్పుడు వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్రతరమైంది. దీంతో ఆశా భాయి బావిలో దూకి చనిపోవాలని అనుకుంది. అనుకున్నట్టే బావిలో దూకేసింది. ఆమెను కాపాడటానికి శంకర్ కూడా బావిలో దూకేశాడు.
Also Read: ఫ్లైట్‌లో టాయిలెట్ల సమస్య.. అర్ధంతరంగా వెనుదిరిగిన విమానం
కొద్ది సేపటికి శంకర్ భార్య ఆశను కాపాడగలిగాడు. బావిలో నుంచి బయటకు తీశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆగ్రహంలో ఆశా భాయి ప్రైవేట్ పార్టులపై శంకర్ రామ్ దాడి చేసి చంపేశాడు. ఆమెను చంపిన తర్వాత ఆ రోజు రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే శంకర్ రామ్ కూర్చున్నాడు.
ఈ ఘటన గురించి ఉదయమే పోలీసులకు తెలిసింది. వారు హుటాహుటిని స్పాట్‌కు వచ్చారు. శంకర్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ ఇంచార్జీ గార్డెన్ జగ్సే పంక్రా తెలిపారు.