Asianet News TeluguAsianet News Telugu

ఫ్లైట్‌లో టాయిలెట్ల సమస్య.. అర్ధంతరంగా వెనుదిరిగిన విమానం

ఆస్ట్రియా నుంచి న్యూయార్క్‌కు బయల్దేరిన ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్ విమానంలో టాయిలెట్ల సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్య వల్ల టాయిలెట్‌లను ఫ్లష్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో రెండు గంటలు ప్రయాణం చేసిన ఆ ఫ్లైట్ యూటర్న్ తీసుకుని తిరిగి ఆస్ట్రియాకు వచ్చేసింది.
 

austrian flight u turn from the new york trip after detecting toilets problem kms
Author
First Published Apr 19, 2023, 12:41 AM IST

వియన్నా: యూరప్ కంట్రీ ఆస్ట్రియా నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు ఫ్లైట్ బయల్దేరింది. అది 8 గంటల ప్రయాణం. ప్రయాణం మొదలు పెట్టిన రెండు గంటలకే ఆ ఫ్లైట్ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఫ్లైట్‌లో టాయిలెట్లు సరిగా ఫ్లష్ కావడం సాధ్యం కాలేదు. దీంతో ఆ విమానం మళ్లీ ఆస్ట్రియాకు యూటర్న్ తీసుకుంది.

ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 ఫ్లైట్ సుమారు 300 మంది తో ఆస్ట్రియా నుంచి న్యూయార్క్‌ కు బయల్దేరింది. ఆ ఫ్లైట్‌లో ఎనిమిది టాయిలెట్లు ఉన్నాయి. సుమారు 300 మంది ప్రయాణికులతో ఆ ఫ్లైట్ న్యూయార్క్ దిశగా రెండు గంటలు ప్రయాణించింది. కానీ, అప్పుడే వారికి ఒక సమస్య కనిపించింది. ఆ ఫ్లైట్‌ లోని 8 టాయిలెట్లలో 5 టాయిలెట్లు సరిగా పని చేయడం లేదు. అవి సరిగా ఫ్లష్ కాలేకపోతున్నాయి. ఓ టెక్నికల్ సమస్య వళ్ల ఫ్లష్ చేయలేకపోయారని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్ ప్రతినిధి ఏఎఫ్‌పీకి మంగళవారం తెలిపారు.

ఆ ఫ్లైట్ వెనక్కి వచ్చిన తర్వాత సమస్యను ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ ఫ్లైట్ మళ్లీ సేవలు అందిస్తున్నది. టాయిలెట్ సమస్య పరిష్కృతమైంది.

Also Read: నైట్ స్ట్రిప్ క్లబ్‌లో గంటన్నరలో 22 షాట్లు.. బ్రిటీష్ టూరిస్ట్ మృతి.. ‘ఆల్కహాల్ పాయిజనింగ్’

కాగా, ఆ ఫ్లైట్‌ ప్రయాణికులు తమ జర్నీ పూర్తి చేసుకోలేకపోయారు. కాబట్టి వారు వియన్నా తిరిగి వచ్చిన తర్వాత వేరే ఫ్లైట్‌‌లలో బుక్ చేసుకుని వెళ్లిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios