ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ సదస్సుకు హాజరు కావాలని ఎందుకు అంతగా తహతహలాడుతున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఈ సమావేశానికి మేయర్లు హాజరు కావాల్సి ఉంటుందని, కానీ సీఎం అవసరం ఏంటని తెలిపింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనపై కేంద్రంతో విబేధించడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం నాడు విరుచుకుపడింది. ‘‘ ప్రభుత్వంలో ఏ శాఖా బాధ్యతలు చేపట్టని ఢిల్లీ సీఎం సింగపూర్‌కు వెళ్లాలని ఎందుకు తహతహలాడుతున్నారు ’’ అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు.
అరుణాచల్ ప్రదేశ్ లో 19 మంది కార్మికులు అదృశ్యం: ఒకరి డెడ్ బాడీ గుర్తింపు
సింగపూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్‌కు ఏ విభాగం సరిపోలడం లేదని పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ అన్నారు. ‘‘ ఇది మేయర్ల శిఖరాగ్ర సమావేశం అయినప్పటికీ కేజ్రీవాల్ అక్కడికి వెళ్లడానికి చాలా తహతహలాడుతున్నారు ’’ అని ఆయన అన్నారు.
అసలేం జరిగిందంటే...
జూన్ 1వ తేదీన జరిగిన ఓ సమావేశంలో సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ (Simon Wong) ఆయన తమ దేశంలో జరిగిన ప్రపంచ నగరాల (WCS) సదస్సుకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మంత్రులు, అధికారులు ఎవరైనా విదేశాలకు వెళ్లాలంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం. పబ్లిక్ సర్వెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం మాత్రమే సరిపోతుంది. కానీ ఢిల్లీ సీఎం సింగపూర్ వెళ్లాలంటే టూర్ విషయంలో లెఫ్టనెంట్ గవర్నర్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ పొందడంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి కూడా రాజకీయ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
Kerala NEET Exam Row : విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై పోలీస్ కేసు, త్వరలో అరెస్టులు..
అయితే ఢిల్లీ సీఎం టూర్ కు సంబంధించిన ఫైల్స్ కు ఇంకా ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు చేశారు. రెండు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ‘‘ సింగపూర్ సదస్సుకు హాజరయ్యేందుకు అనుమతిని ఇవ్వకపోడం తప్పు. ఢిల్లీ పాలనా నమూనాను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇంత భారీ వేదికపై దీనిని ప్రదర్శించకుండా ఒక సీఎంను అడ్డుకోవడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం ’’ అని కేజ్రీవాల్ తాజా లేఖలో పేర్కొన్నారు.
ఇంట్లో క్రికెట్ ఆడుతున్న తేజస్వి యాదవ్, "మోడీ ఎఫెక్ట్" అంటూ గుసగుసలు..
తాను ఈ విషయంలో జూన్ 7న ప్రధాని మోదీకి లేఖ రాశానని ఢిల్లీ సీఎం తెలిపారు. అయితే దానికి సమాధానం రాలేదని ఆయన చెప్పారు. ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచం తెలుసుకోవాలనుకుంటుందని, ఇది దేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు. సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలకు (ఢిల్లీ మోడల్) వివరిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. కాగా సింగపూర్ లో ప్రపంచ నగరాల సదస్సు (WCS) ఆగస్టు 2-3 తేదీల్లో జరగనుంది. సోమవారం కూడా ఈ విషయంలో ప్రధానికి లేఖ రాశారు. తాను ఒక నెల పాటు పర్యటన అనుమతి కోసం వేచి ఉన్నానని చెప్పారు. ‘‘ నేను నేరస్థుడిని కాను. దేశానికి ముఖ్యమంత్రిని, స్వేచ్ఛా పౌరుడిని, సింగపూర్‌కు వెళ్లకుండా నన్ను అడ్డుకోవడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారమూ లేదని, అందుకే దీని వెనుక రాజకీయ కారణం ఉందని తెలుస్తోంది.’’ అని అన్నారు.
