తేజస్వి యాదవ్ బరువుపై ప్రధాని మోడీ  వ్యాఖ్యలు చేసిన తరువాత... తేజస్వీ ట్విటర్ లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

బీహార్ : Bihar మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి అధికారిక నివాసంలో ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు Tejashwi Yadav క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ మేరకు ఆయన తాను క్రికెట్ ఆడిన వీడియోను Social Mediaలో పోస్ట్ చేశారు. జీవితం అయినా... ఆట అయినా ఎల్లప్పుడూ గెలుపుకోసం ఆడాల్సిందేనని చాలా ఏళ్ల తర్వాత ఆనందంగా ఉందంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈ వీడియోలో తేజస్వి యాదవ్ కారు డ్రైవర్, వంట మనిషి, స్వీపర్, గార్డెనర్, కేర్ టేకర్ లతో క్రికెట్ ఆడుతూ సందడి చేశాడు. జూలై 12న బీహార్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని Narendra Modi పాట్నాకు వచ్చిన సంగతి తెలిసిందే.

 ఆ సమయంలో తేజస్వి యాదవ్ తో కాసేపు ముచ్చటించారు మోదీ. మీరు కాస్త బరువు తగ్గాలంటూ సలహా ఇచ్చారు మోడీ. దీని తర్వాత ఆయన క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడుతూ కనిపించారు. బహుశా తేజస్వి యాదవ్ దీన్ని సీరియస్గా తీసుకుని క్యాలరీలు తగ్గించడం ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తేజస్వి యాదవ్ ఢిల్లీ తరఫున జూనియర్ క్రికెట్ లో ఆడాడు. అంతేకాదు 2008--09లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో భాగంగా కూడా ఉన్నాడు. అతను jharkhandకి ప్రాతినిధ్యం వహించి అనేక మ్యాచులు ఆడాడు. ఆ తర్వాత తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ని అనుసరిస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ మేరకు క్రికెట్ ఆడుతున్న వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. 

రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ తన పాట్నా నివాసంలోని తాత్కాలిక క్రికెట్ పిచ్‌లో చెమటలు కక్కుతూ కనిపించడం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. షార్ట్‌, టీ-షర్టు, బూట్లు, హ్యాండ్ గ్లౌజ్ లు వేసుకుని బ్యాట్ ను ఝులిపిస్తున్న వీడియో నెటిజన్ల కామెంట్లు పొందుతోంది. ఈ క్రికెట్ కోసం రెండు ప్లాస్టిక్ కుర్చీలను వికెట్లుగా ఉపయోగించారు. అతని ఇంట్లోని పర్సనల్ స్టాఫ్ ఫీల్డింగ్, కీపింగ్, బౌలింగ్, బ్యాటింగ్ చేశారు. వీడియో చివర్లో తేజస్వి స్పిన్ బౌలింగ్‌ వేయడం కూడా చూడవచ్చు.

తన బరువుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యను యాదవ్ సీరియస్ గా తీసుకుని.. బరువు తగ్గే క్రమంలోనే ఈ ఆట అని కొందరు అంటున్నారు. మామూలుగానే కాస్త ఆవేశపూరిత వక్త అయిన యాదవ్, శతాబ్ది ఉత్సవాల సమయంలో రిటెన్ స్పీచ్ చదివేప్పుడు.. ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖుల సమక్షంలో చాలాసార్లు తడబడ్డారని తెలిసింది. 

ఉత్సావాల అనంతరం వీడ్కోలు పలికే ముందు ప్రధాని మోదీ యాదవ్‌తో "వజన్ కమ్ కరో" అని చెప్పినట్లు విస్తృతంగా పుకారు కూడా ఉంది. దాదాపు తన తండ్రి వయసులో ఉన్న ప్రధాని నుంచి అలాంటి సున్నితమైన సూచన రావడంతోనే.. ఇలా చెమటలు కక్కేలా సాధన చేస్తున్నాడని మీడియాలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Scroll to load tweet…