ఉన్నావ్: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు నిన్న రాత్రి గుండెపోటుతో మరణించింది. కోర్టుకు హాజరయ్యేందుకు రైల్వే స్టేషన్ కి వెళ్తుండగా ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తులతో పాటు మరో ముగ్గురు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించింది. 

తమ కూతురు మరణించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. ఆమె సోదరుడు మాట్లాడుతూ.. తనను బ్రతికించమని వేడుకుందని, తనపై అత్యాచారం జరిపిన వారి మరణాన్ని చూడడానికైనా తాను బ్రతికుండాలని కోరుకుందని, తనను కాపుదానని మాట ఇచ్చానని, కానీ కాపాడుకోలేకపోయామని భోరున ఏడ్చాడు. 

Also read; మైనర్ బాలికపై బంధువుల సామూహిక అత్యాచారం.. దానిని వీడియో తీసి..

ఆ యువతీ తండ్రి మాట్లాడుతూ, తమ కూతురిని అత్యంత కిరాతకంగా చంపారని కన్నీరుమున్నీరయ్యారు. తనకు ఇల్లు,డబ్బు ఇవేవి వద్దని, తన కూతురికి న్యాయం జరిగితే చాలని అన్నాడు. హైదరాబాద్ లో దిశ కు న్యాయం చేసిన పోలీసులు ఇక్కడ తమకు ఎందుకు న్యాయం చేయలేరని ఆయన ప్రశ్నించాడు. 

హైదరాబాద్ లో కాల్చి చంపినా పోలీసులు ఇక్కడ కూడా అలంటి చర్య తీసుకొని తమకు సత్వర న్యాయం చేయాలనీ ఆయన వేడుకున్నాడు. ఆ నిందితులనంతా కాల్చి అయినా చంపండి, లేదా ఉరి అయినా తీయండని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అలా చేసినప్పుడు మాత్రమే తమ కూతురి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నాడు. 

కోర్టు కేసుకు హాజరయ్యేందుకు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఆయువతి రైల్వే స్టేషన్ కు చేరుకునే సమయంలో అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులు శివమ్ త్రివేది, శుభం త్రివేదీలతోపాటు మరో ముగ్గురు దారికాచి ఈ యువతిని బలిగొన్నారు. 

Also read: ఎంతపెద్దవారైనా సరే.. ఎవ్వరినీ విడిచిపెట్టం: యూపీ సీఎం యోగి

వారు తొలుత కర్రతో తన కాలిపై దాడి చేసారని ఆతరువాత మెడపై కత్తితో పొడిచారని ఆ 23 ఎల్లా బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఆ తరువాత తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆయువతి 90 శాతం కాలిన గాయాలతో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

90 శాతం కాలిన గాయాలతో ఉన్న యువతి స్పృహ కోల్పోలేదు. స్పృహ కోల్పోకుండానే ఆసుపత్రిలో చేరింది. వైద్యులు తొలుత ఆమెకు నొప్పి తగ్గించేందుకు ఆంటిబయోటిక్స్, సెడేటివ్స్ తో చికిత్సనారంభించారు. మరింత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు.