మైనర్ బాలికపై బంధువుల సామూహిక అత్యాచారం.. దానిని వీడియో తీసి..
బులాంద్ షాహర్ ప్రాంతానికి చెందిన ఓ 14ఏళ్ల మైనర్ బాలికపై డిసెంబర్ 3వ తేదీన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులకు సమాచారం అందింది.
మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా బాలిక బంధువులే కావడం గమనార్హం. వాళ్లల్లో ఒకరు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులాంద్ షాహర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా... నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... బులాంద్ షాహర్ ప్రాంతానికి చెందిన ఓ 14ఏళ్ల మైనర్ బాలికపై డిసెంబర్ 3వ తేదీన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులకు సమాచారం అందింది.
ఆ వీడియో పోలీసులకు చేరడంతో... విచారణ జరిపి కేసు నమోదు చేసుకున్నారు. సమాచారం అందుకున్న రెండు గంటల్లోనే పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయడం విశేషం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.