ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మరణం పై స్పందించారు. ఈ ఘటన "చాలా విచారకరం" అని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు.నిందితులందరినీ అరెస్టు చేశామని, కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

"నిందితులందరినీ అరెస్టు చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకువెళతారు, కఠిన శిక్ష పడుతుంది" అని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Also read: ఇక నన్నెవరూ తాకలేరు, నేను పరమ శివుడ్ని: స్వామి నిత్యానంద

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన ఉన్నావ్ రేప్ బాధితురాలు గురువారం ఉదయం కోర్టు విచారణకు వెళుతుండగా నిప్పంటించారు. శుక్రవారం రాత్రి 11:40 గంటలకు ఆ యువతీ ప్రాణాలు కోల్పోయింది. 

ఉనావ్ అత్యాచార బాధితురాలి పై యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ, ఈ ఉదంతం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.  “ఇది చాలా దురదృష్టకర సంఘటన, బాధితురాలి కుటుంబం ఎటువంటి పరిస్థితుల్లో ఉందొ,నా ఊహకు కూడా అందడం లేదు. మేము నిందితులను విడిచిపెట్టము, వారికి త్వరగా శిక్ష పడుతుందని నేను వారికి భరోసా ఇస్తున్నాను. ” అని అన్నారు. 

48గంటలపాటు పోరాడి... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి

గత 11 నెలల్లో ఉన్నవ్ లో జరిగిన 86 అత్యాచారాలకు సంబంధించిన నివేదికలపై ఉత్తరప్రదేశ్ న్యాయశాఖ మంత్రి బ్రజేశ్ పాథక్ మాట్లాడుతూ “ఈ కేసులను రాజకీయం చేయకూడదు. నిందితులను వారు ఎంత శక్తివంతులైనా మేము విడిచిపెట్టము. మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. ” అని అన్నారు. 

"బాధితురాలు ఈ రోజు మనతో లేదు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకెళ్లాలని మేము ఈ రోజు సంబంధిత కోర్టుకు విజ్ఞప్తి చేస్తాము. ఈ కేసును రోజువారీగా విచారించమని కూడా మేము విజ్ఞప్తి చేస్తాము, ”అని పాథక్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, , సదరు యువతి మార్చిలో దాఖలు చేసిన అత్యాచారం కేసు విచారణ కోసం స్థానిక కోర్టుకు వెళుతుండగా ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి ఆమెకు నిప్పంటించారు.