Asianet News TeluguAsianet News Telugu

సావర్కర్ కు బ్రిటీషర్లు పెన్షన్ ఎందుకిచ్చారు..? రాహుల్ గాంధీని విమర్శించే వారే చెప్పాలి - నానా పటోలే

రాహుల్ గాంధీని విమర్శించే వ్యక్తులు వీడీ సవార్కర్ కు బ్రిటీష్ ప్రభుత్వం పెన్షన్ ఎందుకు ఇచ్చిందో తెలపాలని కాంగ్రెస్ మహారాష్ఠ్ర అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. తమ పార్టీ ఐక్యంగా, శక్తివంతంగా ఉందని తెలిపారు. 

Why did the British give pension to Savarkar..? Only critics of Rahul Gandhi should say - Maharashtra Congress
Author
First Published Nov 19, 2022, 2:35 PM IST

వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీని నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నాయకులు కూడా ధీటుగా బదులిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడా బీజేపీ నాయకులపై ప్రశ్నలు సంధించారు. 

బలమైన నాయకుడు లేకపోతే ప్రతీ సిటీలో అఫ్తాబ్ పుడతాడు - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

అధినేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను విమర్శించే వారు ముందుగా హిందుత్వ సిద్ధాంతకర్త వీడి సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి రూ..60 పెన్షన్ ఎందుకు అందుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా నానా పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన లభించిందని తెలిపారు. కాంగ్రెస్ ఐక్యంగా, శక్తివంతంగా ఉందని అన్నారు. తమ పార్టీ సైద్ధాంతిక చర్చను కోరుకుంటోందని, ప్రజలను ఏకం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అహింసను విశ్వసిస్తోందని చెప్పారు.

భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ కమ్యూనికేషన్, ప్రచార విభాగం ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరించుకున్నందున గత ఏడాది ఇదే రోజున (నవంబర్ 19న) ‘కిసాన్ విజయ్ దివస్’గా జరుపుకుందని తెలిపారు. ‘‘నవంబర్ 19 చారిత్రాత్మకమైన రోజు. దీనిని కిసాన్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడమే రైతుల సంక్షేమానికి దీర్ఘకాలిక పరిష్కారం’’ అని ఆయన అన్నారు.

ఏడాదికి 365 రోజులు.. 24 గంటలూ దేశాభివృద్ధి కోసం పని చేస్తున్నాం: ప్రధాని మోడీ

కాగా.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి మహిళా ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు పాల్గొన్నారు. ఈ వారం ప్రారంభంలో పాదయాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వీడీ సావర్కర్ పై వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. సావర్కర్ బ్రిటిష్ వారికి సహాయం చేశారని, భయంతో తనకు క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ రాశాడని ఆయన తెలిపారు. 

రాహుల్  గాంధీ వ్యాఖ్యలను పలువురు సమర్ధిస్తుండగా, పలువురు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర గత ప్రభుత్వంలో భాగంగా ఉన్న శివసేన పార్టీ ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉంది. రాహుల్ మాటలను తాము ఏకీభవించడం ఉద్ధవ్ థాక్రే అన్నారు. వీర్ సావర్కర్‌పై మాకు అపారమైన గౌరవం, విశ్వాసం ఉందని అన్నారు. దానిని తుడిచివేయలేమని చెప్పారు. సావర్కర్ త్యాగాలు చేసిన అదే స్వేచ్ఛను కాపాడుకోవడానికి తాను కాంగ్రెస్‌తో చేతులు కలిపానని థాక్రే అన్నారు.

కేరళలో ఏపీ అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా.. బాలుడి మృతి, పలువురికి తీవ్ర గాయాలు.. ప్రమాదంపై సీఎం జగన్ ఆరా..

అయితే గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. వీడీ సావర్కర్ జైలు నుంచి బయటకు రావడానికి బ్రిటిష్ అధికారులకు క్షమాపణలు చెప్పిన మాట నిజమేనని అన్నారు. వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయనీ, హిందుత్వత పార్టీలు చేప్పేవి నిజం కావని, అవన్నీఅవాస్తవమని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కలిసి నడిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios