Asianet News TeluguAsianet News Telugu

తక్ఫీరీ ఉగ్రవాదమేంటీ? ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని అజిత్ దోవల్  ఎందుకు పిలుపిచ్చారు? 

ఇటీవల ఇరాన్‌ పర్యటనలో అజిత్‌ దోవల్‌ తక్ఫీరీ ఉగ్రవాదంపై ధ్వజమెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ , ఇరాన్ ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను పంచుకుంటున్నాయి. భారత్,  ఇరాన్ రెండూ తీవ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నాయి. 

Why did NSA Ajit Doval seek an end to takfiri terrorism  KRJ
Author
First Published May 4, 2023, 2:18 PM IST

ఇటీవలి టెహ్రాన్ పర్యటనలో భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆఫ్ఘనిస్తాన్‌లో స్థిరత్వాన్నిపెంపొందించడానికి , దేశంలో తక్ఫీరీ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఇరాన్ , భారతదేశం కలిసి పనిచేయాలని నొక్కి చెప్పారు. గోవాలో జరగనున్న SCO విదేశాంగ మంత్రుల సమావేశానికి ముందు.. ప్రతినిధుల స్థాయి చర్చలు ఆర్థిక, రాజకీయ , భద్రతా సంబంధాలతో పాటు కీలకమైన ప్రాంతీయ , ప్రపంచ పరిణామాలతో సహా అనేక రకాల అంశాలను చర్చించారు. ఈ  మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లాహియాన్‌లతోనూ దోవల్ సమావేశమయ్యారు.
 
తక్ఫీరీ భావజాలం అంటే ఏమిటి?

తక్ఫీర్ అంటే..అవిశ్వాసం ఆరోపణ లేదా మతభ్రష్టత్వ ప్రకటన. ఇతర తటస్థ ముస్లింలు నిజమైన ముస్లింలు కాదని రాడికల్ ముస్లిం చేసిన ఆరోపణ. ఒక ముస్లిం మరొక ముస్లింను అవిశ్వాసిగా ప్రకటించే ఆచారం, తటస్థ ముస్లింలకు మరణశిక్ష విధించేందుకు కొంతమంది తీవ్రవాదులు ఉపయోగించారు. గతంలో తక్ఫీరీ ఫత్వాల కారణంగా ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్, పంజాబ్ పాకిస్థాన్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్య, రచయితలు సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్‌లపై హత్య బెదిరింపులు వచ్చాయి. అలాగే.. తమిళనాడులోని ఒక రాడికల్ ముస్లిం సమూహం భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాంను అవిశ్వాసిగా, మతభ్రష్టుడిగా ప్రకటించింది .  దైవదూషణ, మతాన్ని ఆచరించకపోవడం వంటి ఆరోపణలపై ముస్లింలను 'ఇస్లామిక్ కమ్యూనిటీ' నుండి బహిష్కరించడానికి భారతదేశంలో క్రమం తప్పకుండా ఫత్వాలు జారీ చేయబడతాయి.
 
ISIS యొక్క ప్రముఖ సిద్ధాంతకర్తలలో ఒకరైన అబూ అబ్దుల్లా అల్-ముహాజిర్ రచించిన ఇష్యూస్ ఇన్ ది జ్యూరిస్ప్రూడెన్స్ ఆఫ్ జిహాద్ (మసైల్ ఫి ఫిక్హ్ అల్-జిహాద్) అనే పుస్తకాన్ని తక్ఫీర్‌కు వేదాంతశాస్త్రంగా భావిస్తారు. వీరి ప్రకారం.. ఇది ముస్లింలు, ముస్లిమేతరులపై హింసను సమర్ధించే న్యాయపరమైన వాదన. ముఖ్యంగా, ముహాజిర్ ఈజిప్షియన్ జిహాదిస్ట్-సలాఫిస్ట్, అతను మాజీ అల్ ఖైదా నాయకుడు అబూ ముసాబ్ అల్-జర్ఖావీని ప్రభావితం చేశాడు.
 
మతాన్ని ఆచరించకపోవడాన్ని , దైవదూషణను తీవ్రమైన నేరాలుగా పరిగణించే తక్ఫీర్ భావన క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఖవారీజ్ పాఠశాల నుండి ఉద్భవించింది. ఖవారీజ్‌లు తోటి తటస్థ ముస్లింలకు వ్యతిరేకంగా మొదటిసారిగా తక్ఫీర్‌ను ప్రకటించారు. వారి హక్కులను స్వాధీనం చేసుకున్నారు. తోటి ముస్లింలపై చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారు. కొన్ని సందర్బాల్లో హత్యలకు పాల్పడ్డారు. ఈ పరిణామాలే.. ఇస్లామిక్ తీవ్రవాదానికి నాంది పలికాయి. కాలక్రమేణా.. ముస్లిం పండితులు, వేదాంతవేత్తలు తక్ఫీర్ భావనను మరింత అభివృద్ధి చేశారు. 

13వ శతాబ్దంలో.. ఇస్లామిక్ పండితుడు ఇబ్న్ తైమియా మానవ నిర్మిత, దైవిక చట్టాల మధ్య వ్యత్యాసాన్ని తెలిపాడు . షరియాచే పరిపాలించబడే భూములకు వలస వెళ్ళమని పూర్వం కింద నివసిస్తున్న ముస్లింలను ప్రోత్సహించాడు. మతభ్రష్టులు, తమ మతపరమైన విధులను నిర్వర్తించడంలో విఫలమైన వారితో సహా అవిశ్వాసులను వివిధ సమూహాలుగా విభజించాడు. ఇబ్న్ తైమియా తక్ఫీర్ భావనను విస్తరించాడు. ఏదైనా మతపరమైన బాధ్యతలో విఫలమవడం నేరమని, తమ మతపరమైన బాధ్యతలలో విఫలమైన ముస్లింలు అవిశ్వాసులు లేదా ఇతర మత సమూహాల సభ్యుల కంటే అధ్వాన్నంగా ఉంటారని వాదించారు.
 
18వ శతాబ్దంలో వహాబిజం స్థాపకుడు ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ తక్ఫీర్ భావనను మరింత అభివృద్ధి చేశాడు.సున్నీ పాఠశాలల నిర్ణయాలను, ప్రవక్త సహచరుల మరణానంతరం జారీ చేయబడిన ఏదైనా ఏకాభిప్రాయాన్ని తిరస్కరించడం ద్వారా ముస్లిం సమాజాన్ని పవిత్రం చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముస్లింలు ప్రవక్త, అతని సహచరుల మార్గాల్లోకి తిరిగి రావాలని కోరారు. ఇస్లాం మొదటి తరం తర్వాత ఏర్పడిన సంప్రదాయాలను అనుసరించే ముస్లింలను బహుదైవారాధకులుగా పరిగణించాడు. 
 
20వ శతాబ్దంలో ముస్లిం-మెజారిటీ రాష్ట్రాలు పాశ్చాత్య చట్టాలను అనుసరించడం ప్రారంభించడంతో తక్ఫీర్ మరింత అభివృద్ధి చెందింది. ఈజిప్టు ముస్లిం బ్రదర్‌హుడ్‌లో ప్రముఖ సభ్యుడు సయ్యద్ కుతుబ్, పాశ్చాత్య నమూనాలను అనుసరించే ముస్లిం సమాజాలు, ప్రభుత్వాలను ఖండించడానికి సమకాలీన జాహిలియా భావనను ఉపయోగించారు.  

మౌదుదీ ఆలోచనలను ISIS నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ వంటి తీవ్రవాద నాయకులు ఉదహరించారు, అతను తనను తాను ఖలీఫాగా నియమించుకున్నాడు . పాన్-ఇస్లామిక్ రాజ్యం గురించి మౌదుదీ యొక్క భావనను ప్రస్తావించాడు. సార్వభౌమాధికారం దేవునికి మాత్రమే చెందుతుందని, ఇస్లామిక్ రాజ్యంలో  పౌరసత్వం ముస్లింలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. మౌదూది  వాదనలను ISIS అనుసరించింది.  అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి తీవ్రవాద గ్రూపులు కూడా మౌదూది  వాదనలను సమర్థించాయి. తత్ఫలితంగా మతపరమైన మైనారిటీల హింసకు దారితీసింది . ISIS నుండి వైదొలగిన ఏ ఇస్లామిక్ వర్గానైనా అణిచివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరాక్‌లో సున్నీకు వ్యతిరేకంగా ISIS ప్రచారం సాగింది. ఈ భావజాలం వల్ల 2014 నుండి ఆఫ్ఘనిస్తాన్,ఇరాక్,  సిరియా వంటి దేశాలలో ముస్లింలపై అరాచకాలు పెరిగాయి.

తూర్పు , ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో ముఖ్యంగా నంగర్‌హార్‌లో డేష్ బలమైన ఉనికిని కలిగి ఉంది, ఇది యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో దాని స్థావరంగా పరిగణించబడుతుంది. 2021లో కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ISKP ప్రారంభించిన ముల్‌తో ఎమిరేట్, IS-ఖొరాసన్ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

తాలిబాన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ అంతటా జర్నలిస్టులు, పౌర సమాజ సభ్యులు , షియా హజారా కమ్యూనిటీపై అనేక ఉగ్రదాడులకు పాల్పడ్డారు. చారిత్రాత్మకంగా హింసించబడిన షియా శాఖ అయిన హజారాలు, ఇరాన్ మతాధికారులు కూడా వీరికి చేతులో బలయ్యారు. గతంలో తాలిబాన్ల  వేధింపుల కారణంగా చాలా మంది హజారాలు ఇరాన్‌కు పారిపోయారు. తాలిబాన్లు షియా మతపరమైన పండుగల సమయంలో తమ రక్షణ కోసం హజారా సమాజానికి హామీ ఇచ్చారు.
 
తక్ఫీర్‌కు వ్యతిరేకంగా ఉద్యమం

ఆందోళనకు గల ప్రధాన కారణం ‘నిజమైన ముస్లిం ఎవరు’? దాని అత్యంత అక్షరార్థమైన, దృఢమైన వివరణ ద్వారా తక్ఫీరీ సమాధానం మిచ్చింది.  అయినా.. తక్ఫీర్ ఆచారాన్ని ఖండిస్తూ ముస్లిం ప్రపంచం నలుమూలల నుండి వ్యతిరేక స్వరాలు వినిపించారు. జూలై 2005లో జోర్డాన్ రాజు అబ్దుల్లా II తక్ఫీర్ సమస్యను చర్చించడానికి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇస్లామిక్ పండితుల అంతర్జాతీయ ఇస్లామిక్ సమావేశానికి నాయకత్వం వహించాడు. 

ఈ సమవేశ ఫలితం సున్నీ, షియా , ఇబాదీ ఇస్లాంల మొక్క 8 మఠాబ్‌లకు (చట్టపరమైన పాఠశాలలు) చట్టబద్ధతను కల్పించడం. సాంప్రదాయ ఇస్లామిక్ వేదాంతశాస్త్రం (అష్'అరిజం); ఇస్లామిక్ ఆధ్యాత్మికత (సూఫిజం), నిజమైన సలాఫీ ఆలోచన వంటి అంశాలపై ఫత్వాలు జారీ చేయడాన్ని నిలిపివేయాలని కూడా నిర్ణయించారు.
 
ఖురాన్‌లోని అనేక శ్లోకాలు అవిశ్వాసుల గురించి ప్రస్తావించాయి. అయితే ఖురాన్ లో ఎక్కడ కూడా మతభ్రష్టత్వాన్ని నిర్వచించలేదు. ఇస్లాంలో మతభ్రష్టత్వం ఎల్లప్పుడూ ప్రజలచే నిర్వచించబడుతుంది. ఖురాన్ శ్లోకాల ప్రకారం.. తక్ఫీర్ ప్రకటించే హక్కు దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే అతను మాత్రమే స్థితిని నిర్ణయించగలడు. ఈ తీర్పు పరలోకంలో జరుగుతుంది. తత్ఫలితంగా ప్రజలు తక్ఫీర్ ప్రకటించడం షరియా చట్టం ప్రకారం మతపరమైన పాపంగా పరిగణించబడుతుంది.
 
ఖురాన్ లోని 6:108, 4:94 వంటి వివిధ  శ్లోకాలలో తక్ఫీర్ యొక్క పరోక్ష నిషేధాన్ని చూడవచ్చు. ఈ శ్లోకాలు ఇతర మతాలను అవమానించకుండా ఉండాలనే ప్రాముఖ్యతను నొక్కిచెప్పాయి. ఇతరులను వ్యతిరేకిస్తే..  ప్రతీకారానికి దారి తీస్తుంది. ఇతరుల పట్ల  తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నాయి. అందువల్ల ISIS వంటి తీవ్రవాద గ్రూపులు తక్ఫీర్ ఉపయోగించడం ప్రవక్త, ఖురాన్ బోధనలకు విరుద్ధమే. ప్రవక్త ముహమ్మద్ ప్రకారం.. ముస్లింలను పాపం చేసినందుకు అవిశ్వాసిగా ప్రకటించడం లేదా వారి చర్యల తీసుకోవడం వంటి చర్యలు ఇస్లాం నుండి బహిష్కరించబడ్డాయని ఇస్లామిక్ పండితులు సూచిస్తున్నారు. 

భారతదేశంలో తక్ఫీర్: 

బ్రియాన్ డిడియర్ తన అధ్యాయంలో సంపాదకత్వం వహించిన సంపుటిలో అక్యుసేషన్స్ ఆఫ్ అన్‌బిలీఫ్ ఇన్ ఇస్లాం: ఎ డయాక్రోనిక్ పెర్స్పెక్టివ్ ఆన్ తక్ఫీర్ అనే అధ్యాయంలో లక్షద్వీప్ ద్వీపానికి చెందిన వహాబీ గ్రూపులు, షంసియా సూఫీల మధ్య కుట్రను, వారి మధ్య చీలికను వివరించారు.  షంసియా సూఫీలను మతవిశ్వాసులుగా ఖండించారు, అవమానించారు. మెజారిటీ భారతీయ ముస్లింలు సున్నీ శాఖకు చెందినవారు. ఇది వహాబీ, బరేల్వి వర్గాలుగా విభజించబడింది. గతంలో వహాబీ ప్రచారకులు బెరెల్విస్‌ను సమాధి ఆరాధన , ఇతర మధ్యవర్తిత్వ అభ్యాసాల కోసం మతభ్రష్టులుగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అహ్మద్ రాజాఖాన్ అభిప్రాయాలు అతన్ని కాఫిర్ (అవిశ్వాసం)ని చేశాయని దేవబంది ఫకర్ రషీద్ అహ్మద్ గంగోహి ప్రకటించారు.
 
అదేవిధంగా, బారెల్విలు ప్రవక్త ముహమ్మద్ ను అగౌరవపరిచినందుకు వహాబీలను అవిశ్వాసులుగా పేర్కొన్నారు. బరేల్వీ శాఖ స్థాపకుడు అహ్మద్ రజా ఖాన్ తన ప్రవచనాలలో ఇలా పేర్కొన్నట్లు నివేదించబడింది. 'ముర్తాద్ మునాఫిక్ (కపటవాదులు) వర్గంలో వహాబీలు, రఫీదీలు (షియా), ఖాదియానీలు , నాటూరిలు (హేతువాదులు) ఉన్నారు. షియాలు, భాయిలు, అహ్మదీలను  వహాబీలు, బారెల్విస్ ఇద్దరూ మతభ్రష్టులుగా ప్రకటించారు. వారి మసీదులలో ప్రార్థనలు చేయడానికి నిరాకరించారు. వారితో వివాహ సంబంధాలను నిషేధించారు. ఈ ప్రకటన నేటికీ ఓ ఆచారంగా సాగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వర్గానికి చెందిన మతాధికారులు మరొకదానిపై ఆధిపత్యం చెలాయించే తక్ఫీరీ ద్వేషపూరిత ప్రసంగాలతో నిండిపోయింది.

ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ ఇటీవల ఇరాన్ పర్యటనలో తక్ఫీరీ ఉగ్రవాద అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఈ ఆంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ , ఇరాన్ ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను పంచుకుంటున్నాయి. భారతదేశం , ఇరాన్ రెండూ తీవ్రవాద ముప్పు గురించి ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా గల దేశం భారత్.  భారతీయ ముస్లింలలో 13% మంది షియాలు ఉన్నారు. గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లలో మోసపూరితంగా ముస్లిం యువకులను చేర్చుకోవడానికి వ్యతిరేఖంగా భారత్ చర్యలు చేపడుతోంది.  

రచయిత: షా ఫైసల్

Follow Us:
Download App:
  • android
  • ios