Asianet News TeluguAsianet News Telugu

ఎవరీ నిర్భయ: కేసు పూర్వాపరాలు

నిర్భయపై గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా కొత్త చట్టానికి నాంది పలికింది. దేశంలో ప్రతి ఒక్కరూ నిర్భయ బతకాలని కోరుకొన్నారు. కానీ, తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. 

who is NIrbhaya: what is the Nirbhaya case

 నిర్భయపై గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా కొత్త చట్టానికి నాంది పలికింది. దేశంలో ప్రతి ఒక్కరూ నిర్భయ బతకాలని కోరుకొన్నారు. కానీ, తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. మహిళలపై అత్యాచారాలకు నిరసనగా బాధితురాలి పేరుతో కొత్త చట్టం వచ్చింది.  నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన అత్యాచార ఘటన కేసుల్లో మార్పుల కోసం ప్రజల నుండి వచ్చిన సలహలను, సూచలను తీసుకొని కొత్త చట్టం అమల్లోకి వచ్చింది.

2012 డిసెంబర్ 16వ తేది రాత్రి పూట తన స్నేహితుడు అవ్వింద్రప్రతాప్ తో కలిసి 23 ఏళ్ల యువతి ఇంటికి బయలుదేరేందుకు దక్షిణ ఢిల్లీలోని మునిర్ఖా వద్ద ద్వారకా వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ద్వారకా వెళ్లే ఓ ప్రైవేట్ బస్సులో స్నేహితుడితో కలిసి 23 ఏళ్ల యువతి బస్సు ఎక్కింది.

అయితే ఆ బస్సులో ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారంతా అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్నారు. ఈ బస్సును రామ్ సింగ్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అయితే బస్సు కొద్దిదూరం వెళ్లిపోయిన తర్వాత ద్వారకా వెళ్లే మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి రామ్ సింగ్ మళ్లించాడు. ఈ విషయమై ఆ యువతి స్నేహితుడు ప్రశ్నించాడు. బస్సును ఆపాలని కోరాడు. 

కానీ, బస్సును ఆపకుండా ఆ యువతి స్నేహితుడిని రాడ్ తో తీవ్రంగా కొట్టారు. బస్సులోనే ఆ యువతిపై వారంతా సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. నడుస్తున్న బస్సులోనే ఒకరి తర్వాత ఆ యువతిపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు.

అత్యాచారానికి పాల్పడడమే కాకుండా బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్ లో రాడ్స్ దూర్చారు. ఢిల్లీ రోడ్లపై బస్సును తిప్పుతూ యువతిపై అత్యాచారానికి పాల్పడి చివరగా నడుస్తున్న బస్సు నుండి వారిద్దరిని రోడ్డుపై తోసేశారు. తీవ్రంగా గాయపడిన తన స్నేహితురాలిని ఆ యువకుడు పేవ్ మెంట్ పై పడుకోబెట్టాడు. అంతేకాదు పోలీసులలకు సమాచారమిచ్చాడు.

బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారు.గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలలో బాధితురాలు పేరు బయటకు వెల్లడించకూడదనేది ప్రసారమాథ్యమాల నియమం. ఈ మేరకు బాధితురాలికి నిర్భయ అనే పేరు పెట్టారు. 16 రోజుల పాటు బాధితురాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందింది.

మెరుగైన చిచకిత్సకోసం బాధితురాలిని సింగపూర్ ఆసుపత్రికి తరలించారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29వ తేదీన నిర్భయ మృత్యువాత పడింది. నిర్భయ 16 రోజుల పాటు మృత్యువుతో పోరాడింది.

అయితే నిర్భయపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన  విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో యువత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఢిల్లీ గేట్ వేదికగా చేసుకొని వేలాది మంది యువత ఆందోళన చేశారు. ఢిల్లీగేట్ వద్ద 2012 డిసెంబర్ 12 వ తేదీన యువత ఆందోళనకు దిగింది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఇదే రకంగా ఆందోళనలు చోటు చేసుకొన్నాయి.

మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు సత్వరమే శిక్షపడేలా చట్టం తేవాలని డిమాండ్ మొదలైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కూడ డిమాండ్ మొదలైంది. దీంతో  2012 డిసెంబర్ మాసంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం జెఎస్ వర్మ నేతృత్వంలో జ్యూడీషీయల్ కమిటీని ఏర్పాటు చేసింది. అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా సుమారు 84 వేలకు పైగా సలహలను సూచలను ఈ కమిటీ సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది.

అప్పటి  యూపీఏ ప్రభుత్వం అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు సత్వరమే శిక్ష పడేలా నిర్భయ పేరుతో ఆర్డినెన్స్ తెచ్చింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేశారు. ఈ కేసులో  నిందితులకు సత్వరమే శిక్షపడేలా 6 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

నిర్భయపై  రామ్ సింగ్, ముఖేస్ సింగ్, వినయ్ గుప్తా, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్షయ్ ఠాకూర్ 18 ఏళ్లకు కొన్ని రోజులు మాత్రమే తక్కువ వయస్సు ఉంది. అయితే అతడిని జువైనల్ హోంకు తరలించారు. మూడేళ్ల పాటు  శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం జైలు నుండి విడుదల అయ్యారు.

ఈ నిందితులకు కోర్టు ఉరిశిక్షను విధించింది. అయితే ఉరి శిక్షను సవాల్ చేస్తూ నిందితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశారు.ముగ్గురు నిందితులు మాత్రమే రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగో వ్యక్తి కూడ త్వరలో ఈ విషయమై రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయనున్నట్టు నిందితుడి తరపు న్యాయవాది ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు బస్సు డ్రైవర్ గా పనిచేసిన రామ్ సింగ్  తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం రామ్ సింగ్ ది హత్యేనని అప్పట్లో ఆరోపణలు చేశారు.

మిగిలిన ఐదుగురు నిందితుల్లో మైనర్ శిక్ష పూర్తైంది. నలుగురు నిందితులు జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఈ నిందితుల పిటిషన్ ను సోమవారం నాడు కొట్టేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios