మే 13న బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుంది - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్
త్వరలో విడుదల కానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కే అనుకూలంగా వస్తాయని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 13వ తేదీన బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుందని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు. యావత్ దేశం చూపు కర్ణాటక ఎన్నికలపై పడిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓ వైపు డబ్బు పంపిణీ, మరో వైపు ప్రజల ప్రేమ ఉందని చెప్పారు.
ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..
బుధవారం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని, నాలుగు ఎగ్జిట్ పోల్స్ పూర్తి మెజారిటీని ఇచ్చాయి. కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని కొన్ని పోల్స్ అంఛనా వేశాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ అధికారం చేపడుతుందని భూపేశ్ బఘేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్యాయానికి, అణచివేతకు, అవినీతికి పాల్పడే వారిని దేవుడు శిక్షిస్తాడు కాబట్టి కర్ణాటకలోని భజరంగబలి ఆశీస్సులు కాంగ్రెస్ కు ఉంటాయని సీఎం బఘేల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈడీ చర్యలపై సీఎం స్పందిస్తూ.. ఈడీ ఎలాంటి నేరం చేయకుండా దర్యాప్తు చేపట్టలేదని, కానీ భారత చరిత్రలోనే తొలిసారిగా ఇక్కడి ఈడీ ఈ పని చేస్తోందని అన్నారు. ‘‘తమ యజమానులను ప్రసన్నం చేసుకోవడానికి వారు (ఈడీ) బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, అందువల్ల వారు నియమనిబంధనలను పాటించడం లేదు’’ అని ఆరోపించారు.
రాత్రంతా ప్రజలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇబ్బంది పెడుతున్నారని సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని, బీజేపీ నేరుగా తమను ఎదుర్కోలేకపోతోందన్నారు. నవంబర్ లో ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ధీమా వ్యక్తం చేశారు. అందుకే వారు (బీజేపీ) తమ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసే పనిలో నిమగ్నమయ్యారన్నారు.
రాజస్తాన్ సీఎం గెహ్లాట్ మాట్లాడుతుండగా ‘మోడీ.. మోడీ..’ నినాదాలు.. ప్రధాని ఏం చేశాడంటే?
కాగా.. కర్ణాటకలో పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జనతాదళ్-సెక్యులర్ జేడీఎస్ 2018 ఎన్నికల్లో గెలిచిన 37 సీట్లను కూడా ఈ సారి చేరుకోదని, రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుందని అంచనా వేశాయి. కర్ణాటకలో హంగ్ ఏర్పడితే జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరించే అవకాశం ఉందని చెప్పాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ కు 122-140 సీట్లు, బీజేపీకి 62-80 సీట్లు, జేడీఎస్ కు 20-25 సీట్లు, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని తెలిపింది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఒక పార్టీకి మెజారిటీ రావాలంటే 113 సీట్లు అవసరం.