కర్ణాటక: ఈమధ్య ప్రజాప్రతినిధులు వింతవింతగా ప్రవర్తిస్తున్నారు....సరికొత్త ప్రయోగాలు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు..చేసే పని పారదర్శకతతో కాకుండా మెుక్కుబడిగా చేస్తూ తమ నిర్లక్ష్య బుద్దిని బయటపెట్టేస్తున్నారు. ఈ మధ్య ఇవి మరీ ఎక్కువ అయ్యాయి...

ఒకరు మాజీప్రధాని అటల్ జీ చనిపోకముందే నివాళులర్పిస్తారు...మరోకరు వరదల బాధితులకు బిస్కెట్ పాకెట్లు విసిరుతారు...ఇంకొకరు విద్యార్థులకు చేతితో కాకుండా చాకుతో కేకు తినిపిస్తారు.....కేరళతోపాటు కర్ణాటకను వరదలు వణికించాయి. వరద సమయంలో మంత్రి రేవణ్ణ కొడగులో వరద బాధితులకు బిస్కెట్‌ పాకెట్లను విసిరివేయడం వివాదాస్పదంగా మారింది. 

బీజేపీ నేతలు రేవణ్ణ వ్యవహరించిన తీరును తూర్పారపట్టారు. వరదబాధితులను ఆదుకునే తీరు ఇదేనా అంటూ బీజేపీ ఘాటుగా విమర్శించింది. బీజేపీ విమర్శలతో కంగుతిన్న జేడీఎస్ బీజేపీని ఇరకాటంలో పెట్టింది. ఫిబ్రవరిలో మాజీ సీఎం యడ్యూరప్ప తన పుట్టిన రోజున చాకుతో అంధవిద్యార్థికి  కేక్‌ తినిపించిన ఫోటోను సంపాదించింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి మరి దీన్నేమంటారు అంటూ ఎదురుదాడికి దిగింది జేడీఎస్.  

 మెుత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక పార్టీ అధ్యక్షుడిగా...సీఎంగా పనిచేసిన యడ్యూరప్పపుట్టిన రోజున కట్ చేసిన కేకును చేతితో తినిపించకుండా చాకుతో తినిపించడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

వరదలు: ఆ మంత్రి చేసిన పనికి షాక్, దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

బ్రతికుండగానే.. వాజ్ పేయి చనిపోయారని ట్వీట్.. వివాదం