Asianet News TeluguAsianet News Telugu

చైనాను వణికిస్తున్న కరోనా వేరియంట్ బీఎఫ్.7 స్వభావం?.. సోకితే వచ్చే లక్షణాలు ఏమిటీ?

బీఎఫ్.7 కరోనా వేరియంట్ చైనాను వణికిస్తున్నది. మన దేశంలోనూ ఈ వేరియంట్‌కు చెందిన నాలుగు కేసులు రిపోర్ట్ అయినట్టు అధికారవర్గాలు వివరించాయి. ఈ నేపథ్యంలోనే బీఎఫ్.7 స్వభావం ఏమిటీ? అది సోకితే కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
 

what is bf.7 variant? what are the symptoms? which caused spurt in china corona cases
Author
First Published Dec 22, 2022, 2:47 PM IST

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై నుంచి చైనాను బీఎఫ్. 7 కరోనా వేరియంట్ వణికిస్తున్నది. అక్కడ ఐసీయూలు పేషెంట్లతో నిండిపోయాయి. స్మశానాల ముందు క్యూ లైన్లు వెలిశాయి. ఇదంతా బీఎఫ్. 7 వేరియంట్ సృష్టించిన బీభత్సం. గతంలో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు డెల్టా వేరియంట్ సమయంలో చూశాం. కానీ, అప్పుడు చైనాలో కేసులు అదుపులోనే ఉన్నా.. ఇప్పుడు అలాంటి పరిస్థితులను ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఈ వేరియంట్ కేవలం చైనాకే పరిమితం కాలేదు. యూఎస్ సహా యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్ డెన్మార్క్ వంటి యూరోపియన్ దేశాల్లోనూ బీఎఫ్. 7 వేరియంట్ బయటపడింది. మన దేశంలోనూ నాలుగు కేసులు ఈ వేరియంట్‌వి గుర్తించారు. అందులో మూడు గుజరాత్‌లో, ఒకటి ఒడిశాలో నమోదైనట్టు అధికారవర్గాలు వివరించాయి.

ఈ నేపథ్యంలోనే బీఎఫ్ 7 వేరియంట్ గురించి తెలుసుకుందాం. ఒమిక్రాన్ నుంచి పరిణామం చెందిన వేరియంట్లు చాలా ఉన్నాయి. అందులో బీఏ.2, బీఏ.5 వేరియంట్లు మిగతా వాటికంటే బలంగా ఉన్నాయి. ఈ బీఏ.5 ఒమిక్రాన్ వేరియంట్ సబ్ లీనియేజ్ బీఏ.5.2.1.7. దీన్నే షార్ట్‌గా బీఎఫ్.7.

ఇప్పటి వరకు తెలిసిన కరోనా వేరియంట్‌లలో అన్నింటికంటా వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగినది ఈ బీఎఫ్.7 వేరియంటే. ఇన్ఫెక్షన్ ఎబిలిటీ ఎక్కువ. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ తక్కువ. అందుకే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఒకరి నుంచి మరొకరు వ్యాపించే శక్తి, రీప్రొడక్షన్ వ్యాల్యూ ఈ వేరియంట్‌కు ఎక్కువ. అంటే.. ఒకరికి ఈ వేరియంట్ సోకిన తర్వాత మరొకరికి కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా టీకాలు తీసుకున్న వారికి కూడా సోకే శక్తి ఈ వేరియంట్‌కు ఉన్నది.

Also Read: మ‌ళ్లీ క‌రోనా పంజా: అప్ర‌మ‌త్త‌మై రాష్ట్రాలు.. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఉత్త‌ర్వులు

అయితే, గతంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొన్న అనుభవం లేని, లేదా దాన్ని ఎదుర్కొనే శక్తి చైనీయుల రోగ నిరోధశక్తికి లేని కారణంగా (లో లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ) ఈ వేరియంట్ అక్కడ కార్చిచ్చులా వ్యాపిస్తున్నదని తెలుస్తున్నది. మన దేశంలో ఇది వరకే శక్తిమంతమైన వేరియంట్లను ఎదుర్కొని.. వాటిని నిలువరించే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల ఈ వేరియంట్ వల్ల కొంత ప్రమాదం తక్కువే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సోకితే కనిపించే లక్షణాలు..

ఇతర కరోనా సబ్ వేరియంట్ సోకితే కనిపించే లక్షణాలే బీఎఫ్.7 సోకినా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కామన్ సింప్టమ్స్ ఇలా ఉన్నాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు, వాంతులు, డయేరియా, ఆయాసం వంటి లక్షణాలు సాధారణంగా బీఎఫ్.7 సోకితే కనిపిస్తాయి. అయితే, ఇది వరకే ఆయా వ్యాధుల బారిన పడినవారికి, వ్యాధులతో ఉన్నవారికి లేదా బలహీన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో మాత్రం లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. బీఎఫ్.7 సోకగానే ఆరోగ్యం అనూహ్యంగా క్షీణించవచ్చని చెబుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఈ వేరియంట్‌ బీభత్సం నేపథ్యంలోనే రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios