Asianet News TeluguAsianet News Telugu

మూడు నెలల్లో రూ. 100 కోట్లు సీజ్ చేసిన ఈడీ.. ఈ క్యాష్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరిది?

ఇటీవలి కాలంలో ఎన్‌ఫోర్స‌మెంట్ డైరెక్టరేట్ కళ్లు బైర్లు కమ్మేలా క్యాష్‌ను సీజ్ చేస్తున్నది. మరి ఇంతకీ ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది. ఆ డబ్బుపై అధికారం ఎవరిది? ఆ డబ్బు కేంద్రం ఖజానాకు చేరుతుందా? లేక రికవరీ చేసిన వ్యక్తి దగ్గరకే వెళ్లుతుందా?
 

what happens to the recoverd crores of cash by ED.. here is the answer
Author
First Published Sep 12, 2022, 2:21 AM IST

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత మూడు నెలల కాలంలో సుమారు రూ. 100 కోట్లు సీజ్చేసింది. పలు కేసుల్లో తనిఖీలు చేసి అక్రమంగా భావించిన ఈ డబ్బును స్వాధీనం చేసుకుంది. తాజాగా, కొల్‌కతా బిజినెస్‌మన్ ఓ మొబైల్ గేమింగ్ అప్లికేషన్ ద్వారా ఫ్రాడ్ చేసినట్టుగా భావిస్తున్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ సుమారు రూ. 17 కోట్లు సీజ్ చేసింది. ఈ క్యాష్ లెక్కించడానికి ఈడీ సుమారు ఎనిమిది మంది బ్యాక్ అధికారులను పిలిచింది. వారంతా కరెన్సీ కౌంటింగ్ మెషీన్‌లతో అక్కడికి చేరుకుని లెక్కించారు.

గత కొన్ని వారాల క్రితం ఈడీ దాని చరిత్రలోనే అత్యధిక మొత్తంలో డబ్బు సీజ్ చేసింది. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ అపార్ట్‌మెంట్లలో ఈడీ సుమారు రూ. 50 కోట్లు సీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్ ఎస్ఎస్‌సీ స్కామ్‌‌కు ఈ డబ్బుకు సంబంధం ఉన్నదని ఆరోపణలు ఉన్నాయి.

దీనికంటే ముందూ జార్ఖండ్ మైనింగ్ కేసులో ఈడీ సుమారు రూ. 20 కోట్ల నగదు సీజ్ చేసింది. వీటితోపాటు ఈడీ మరికొన్ని కేసుల్లోనూ డబ్బులు స్వాధీనం చేసుకుంది. 

ఈడీ సీజ్ చేసిన డబ్బు ఎవరిది?

ఈడీ సీజ్ చేసిన డబ్బు ఎవరి వద్దకు వెళ్లుతుంది. ఈడీ వాడుకోవచ్చా? లేక బ్యాంకుల్లోకి వెళ్లుతుందా? వంటి అనేక సందేహాలు చాలా మందికి వచ్చే ఉంటాయి. అందుకు సమాధానాలు వెతుక్కుందాం. ఆర్థిక అక్రమాలను దర్యాప్తు చేసే ఈడీ డబ్బును సీజ్ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. కానీ, వాటిని వినియోగించుకునే అధికారులు దానికి లేవు. రికవరీ చేసిన ఆ డబ్బును కనీసం దాని వెంట కూడా ఉంచుకోలేదు. ప్రొటోకాల్ ప్రకారం, ఏ కేసులోనైనా ఈడీ డబ్బు రికవరీ చేసేటప్పుడు.. ముందుగా సదరు నిందితుడికి ఆ డబ్బు ఎలా వచ్చింది? అనే విషయాలపై వారిని అడుగుతారు. ఆ డబ్బు ఎలా వచ్చిందో సదరు నిందితుడు ఈడీ సంతృప్తి చెందేలా కచ్చితమైన, చట్టబద్ధమైన సమాధానం ఇస్తే ఆ డబ్బును ముట్టుకోరు. కానీ, చట్టబద్ధమైన సమాధానాన్ని ఇవ్వడంలో విఫలం అయితే, ఆ డబ్బును అక్రమ డబ్బుగా భావిస్తుంది.

అప్పుడు ఆ డబ్బును ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద సీజ్ చేస్తుంది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులను ఆ కరెన్సీని లెక్కించడానికి పిలుస్తారు. వార నోట్ కౌంటింగ్ మెషీన్‌లతో డబ్బు లెక్కిస్తారు. ఆ డబ్బుల లెక్కింపు ముగిసిన తర్వాత ఈడీ సీజర్ లిస్టు తయారు చేస్తుంది. బ్యాంకు అధికారుల సమక్షంలోనే ఈడీ సీజర్ లిస్టు తయారు చేస్తుంది.

ఈ సీజర్ మెమోలో రికవరీ చేసుకున్న డబ్బు ఎంత? దాని డినామినేషన్లతో సహా రికార్డు చేసుకుంటుంది. అంటే.. 2000 డినామినేషన్లు ఎన్ని ఉన్నాయి? 500 డినామినేషన్లు ఎన్ని ఉన్నాయి? అనే కచ్చితమైన సమాచారాన్ని రికార్డు చేస్తారు. ఆ తర్వాత వాటిని స్వతంత్ర సాక్షుల సమక్షంలో ఆ డబ్బును బాక్సుల్లో వేసి సీల్ చేస్తారు. 

డబ్బును సీల్ చేసి, సీజర్ మెమో తయారు చేసిన తర్వాత ఆ డబ్బును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు పంపిస్తారు. అక్కడ ఈ డబ్బును ఈడీకి చెందిన పర్సనల్ డిపాజిట్ (పీడీ)లో డిపాజిట్ చేస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఆ డబ్బును సెంట్రల్ గవర్న‌మెంట్ ట్రెజరీలో జమ చేస్తారు.

సీజ్ చేసిన డబ్బును ఈడీ, ఆ బ్యాంకు లేదా ప్రభుత్వం కూడా వినియోగించకోలేదు. ఆ ఏజెన్సీ ఒక ప్రొవిజినల్ అటాచ్‌మెంట్ ఆర్డర్‌ను ప్రిపేర్ చేస్తుంది. ఒక అడ్జుడికేటింగ్ అథారిటీ దాన్ని ఆరు నెలల్లో కన్ఫామ్ చేస్తారు.

ఈ అటాచ్‌మెంట్ ఆర్డర్ ద్వారా రికవరీ చేసిన డబ్బును ఎవరూ వినియోగించుకోలేరు. అటాచ్‌మెంట్ కన్ఫామ్ కాగానే ఆ డబ్బు బ్యాంకులో ఊరికే ఉండిపోతుంది. ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆ డబ్బును ఎవరూ ముట్టుకోరు. ఆ కేసు విచారణలో నిందితుడు దోషిగా తేలితే.. ఆ డబ్బు కేంద్ర ప్రభుత్వం ఆస్తిగా మారుతుంది. లేదంటే.. ఆ కేసు విచారణలో నిందితుడు నిర్దోషి అని కోర్టు తేల్చితే.. ఆ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios