జమిలి ఎన్నికలతో సామాన్యులకు ఒరిగేదేమిటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తో సామాన్యులకు ఏమి వస్తుందని ప్రశ్నించారు. దానికి బదులు వన్ నేషన్, వన్ ఎడ్యుకేషన్ లేదా వన్ నేషనల్ వన్ ట్రీట్‌మెంట్ మరెంతో ఉపయోగకరం కదా? అని అడిగారు.స 

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌తో సామాన్యులకు ఒరిగేదేమిటీ? అని ప్రశ్నించారు. ఇలాంటి ఏర్పాట్ల ద్వారా సామాన్య పౌరులు ఏం లబ్ది పొందుతారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. దేశానికి ఏది ముఖ్యం? ఒక దేశం, ఒక ఎన్నికనా? ఒక దేశం, ఒక విద్యనా? అని ప్రశ్నించారు.

ఆయన హిందీ భాషలో ఎక్స్‌లో పోస్టు చేస్తూ ఈ ప్రశ్నను లేవదీశారు. ‘దేశానికి ఏది ముఖ్యం? ఒక దశం, ఒక ఎన్నికనా? లేక ఒక దేశం, ఒక ఎడ్యుకేషనా?(అది సంపన్నులైనా, పేదలైనా అందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచాలి)’ అని తెలిపారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షనా? లేక వన్ నేషన్, వన్ ట్రీట్‌మెంటా? (సంపన్నులైనా, పేదలైనా ఒకే చికిత్స)’ ఏది ముఖ్యం? అని అడిగారు. ఒక దేశం, ఒక ఎన్నికతో సామాన్యుడు ఏం పొందుతాడు? అని ఆ పోస్టులో ప్రశ్నించారు.

Scroll to load tweet…

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలోని బివానీ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌ తరహాలోనే హర్యానాలో కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తామని పేర్కొన్నారు.

Also Read: కశ్మీర్, అరుణాచల్‌లో జీ20 కార్యక్రమాలపై చైనా అభ్యంతరం.. కొట్టిపారేసిన పీఎం మోడీ

ఒక రోజు ముందు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉచితాలు ప్రకటించడం కంటే కూడా ఆత్మనిర్భరత వైపే మొగ్గు చూపుతుందని అన్నారు. ఈ వీడియోకు సమాధానంగా ఎక్స్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా కామెంట్ చేశారు. 

‘ఖట్టార్ సాబ్.. మేం ఉచితంగా అంతర్జాతీయ శ్రేణి విద్యను అందిస్తున్నాం. ఉచితంగా ప్రపంచస్థాయి చికిత్సను ఢిల్లీలో అందిస్తున్నాం. 24 గంటలు ఉచిత విద్యుత్, నీరు అందిస్తున్నాం. ఇవే విధానాలను పంజాబ్‌లోనూ ప్రారంభించాం. ప్రజలు ఈ సౌకర్యాల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. త్వరలోనే హర్యానా ప్రజలు కూడా ఈ ప్రయోజనాలు పొందుతారు’ అని ట్వీట్ చేశారు.