భారత అత్యున్నత నాయకత్వానికి అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ షాకిచ్చింది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ఖాతాలను వైట్ హౌస్ అన్ ఫాలో చేసింది.

అలాగే అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఖాతాను కూడా ఫాలో అవ్వడం మానేసింది. ఇందుకు గల కారణాలను శ్వేత సౌధం వెల్లడించలేదు. కాగా మూడు వారాల క్రితం వైట్ హౌస్ అనుసరిస్తున్న ఏకైక ప్రపంచనేతగా ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు.

Also Read:లాక్ డౌన్: వలస కూలీలకు, విద్యార్థులకు కేంద్ర ఊరట

శ్వేతసౌధం ట్విట్టర్ ఖాతాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మంది అనుసరిస్తున్నారు. అలాంటి వైట్ హౌస్ ప్రధాని మోడీని ఏప్రిల్ 10 నుంచి ఫాలో అవ్వడం మొదలుపెట్టింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోడీల మధ్య స్నేహబంధానికి చిహ్నంగా ఇలా చేసింది. ఆ తర్వాత కరోనా నివారణలో భాగంగా మెరుగైన ఫలితాలు ఇస్తున్నహైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై ఆంక్షలను మోడీ సడలించిన సంగతి తెలిసిందే.

Also ReadL:కరోనా దెబ్బ: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే రూ. 5 వేలు ఫైన్

ఇంతకుముందు వైట్ హౌస్ ట్విట్టర్‌లో 19 ఖాతాలను అనుసరించగా, తాజాగా ఆరు ఖాతాలను ఆన్‌ఫాలో చేసింది. ఇవన్నీ భారత్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. ఇప్పుడు శ్వేతసౌధం కేవలం అమెరికా నేతలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతోంది. శ్వేతసౌధం తీరుపై నెటిజన్లు ఫైరయ్యారు.