కరోనా దెబ్బ: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే రూ. 5 వేలు ఫైన్

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగితే రూ. 5 వేలు ఫైన్ విధించనున్నట్టుగా జిల్లా ఎస్పీ ఇలంగో స్పష్టం చేశారు.

Rs 5,000 fine for not wearing masks in Kerala's Wayanad

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగితే రూ. 5 వేలు ఫైన్ విధించనున్నట్టుగా జిల్లా ఎస్పీ ఇలంగో స్పష్టం చేశారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ పోలీస్ యాక్ట్ ప్రకారంగా ఈ జరిమానాను విధిస్తామన్నారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని ఆయన కోరారు.

also read:ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి, అలా ఉంటే ఆఫీసుకి రావొద్దు: ఉద్యోగులకు కేంద్రం ఆదేశం

జరిమానాను చెల్లించకుండా కోర్టులో కేసును ఎదుర్కొనేవారికి కూడ ఇబ్బందులు తప్పకపోవచ్చు. కోర్టులో నేరం రుజువైతే  మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానాను విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

బహిరంగ ప్రదేశాలకు మాస్కులు లేకుండా వచ్చే వారితో పాటు దుకాణదారులకు కూడ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలకు వచ్చే వారికి శానిటైజర్ తో చేతులు శుభ్రపర్చుకొనేందుకు సౌకర్యాలు కల్పించకపోతే జరిమానాను విధించనున్నట్టుగా ఎస్పీ చెప్పారు.

దుకాణాల్లో సబ్బు లేదా శానిటైజర్ ఇవ్వకపోతే దుకాణ యజమానికి రూ. 1000 జరిమానా విధఇంచనున్నట్టుగా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.దుకాణాల్లో పనిచేసే వారికి మాస్కులు ధరించకపోతే ఈ జరిమానాను అర్హులని పోలీసులు తెలిపారు.

కేరళ రాష్ట్రంలో బుధవారం నాడు ఉదయానికి 485 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 359 మంది కరోనా నుండి కోలుకొన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios