Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రతో సరిహద్దు వివాదాన్ని న్యాయ పోరాటంతోనే గెలుస్తాం - కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు వివాదాన్ని న్యాయస్థానాల ద్వారానే తేల్చుకుంటామని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వారితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కన్నడిగులతో కాపాడుకునేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 

We will win the border dispute with Maharashtra only through legal battle - Karnataka CM Basavaraj Bommai
Author
First Published Dec 6, 2022, 4:34 PM IST

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని న్యాయపోరాటంతోనే గెలుస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. సరిహద్దు వివాదం కారణంగా చెలరేగిన ఉద్రిక్తతపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బొమ్మై తప్పుపట్టారు. రాష్ట్ర సరిహద్దు, అక్కడి ప్రజలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 

ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ కర్ణాటక వైఖరికి ఎన్నికలతో సంబంధం లేదు, ఇది మహారాష్ట్ర చాలా కాలంగా లాగిన సమస్య. మహారాష్ట్ర కారణంగా ఈ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలకు సంబంధించినది. ఇది (సరిహద్దు సమస్య) సుప్రీంకోర్టులో ఉంది. మేము న్యాయపోరాటంలో గెలుస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.” అని సీఎం అన్నారు. సరిహద్దు వివాదంపై న్యాయపరంగా పోరాడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి ఆయన విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ పనిని 20 ఏళ్ల వయసులోనే చేశా ..: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

ఎన్నికలకు ముందు గ్రామాలను బదిలీ చేయడం కర్ణాటక వ్యూహమా అని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై సీఎం బొమ్మై స్పందించారు. “మేము మా సరిహద్దులు, ప్రజలను రక్షించడానికి కట్టుబడి ఉన్నాము. అంతే కాదు మహారాష్ట్ర, కేరళ  తెలంగాణలోని కన్నడిగులు కాపాడే మాట మీద కూడా నిలబడి ఉన్నాం’’ అని తెలిపారు.

కాగా.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కర్ణాటక రాష్ట్రం మా ప్రాంతాలు, గ్రామాలు, జాథ్, షోలాపూర్‌ని కూడా అడుగుతోంది. వారు మా పండర్‌పూర్ విఠోబాను కూడా అడుగుతారా? ఇది ఓ కొత్త ప్రశ్నను లేవనెత్తుతోంది. మహారాష్ట్రలో అసలు ప్రభుత్వం ఉందా ? గుజరాత్ ఎన్నికలకు ముందు ఇలాగే కొన్ని వ్యాపారాలను అక్కడికి మార్చారు కాబట్టి కర్ణాటక ఎన్నికలకు ముందు మన గ్రామాలను కర్ణాటకకు ఇస్తారా? ’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

23 అడుగుల గోడ దూకి జైలు నుంచి ఇద్దరు ఖైదీల ఎస్కేప్.. రేప్, మర్డర్ కేసుల్లో నిందితులు

మహారాష్ట్ర, కర్ణాటకల రాష్ట్రాల మధ్య వివాదం 1956 నుంచే ఉంది. 1956 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రెండు రాష్ట్రాలు విడిపోయాయి. అయితే కర్ణాటకతో ఉన్న సరిహద్దును సరిదిద్దాలను మహారాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాలు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాయి. ప్రధానంగా కన్నడ మాట్లాడే 260 గ్రామాలను బదిలీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కర్ణాటక దానిని తిరస్కరించింది. ఇప్పుడు, కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పెండింగ్‌లో ఉన్నందున, కేసును వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

సీఎం విజయన్ అధికారిక నివాసంలో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. అసలేం జరగిందంటే..?

కాగా.. డాక్టర్ బీఆర్ అంబేదాకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించేందుకు కేబినెట్ మంత్రి గోవింద్ కారజోల్‌తో కలిసి వచ్చిన సమయంలో బొమ్మై మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్ తమ బెళగావి పర్యటనను వాయిదా వేసిన తర్వాత బొమ్మై నుంచి ఆ ప్రకటన వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios