కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా అధికారి తన పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగిందని మ్యూజియం పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఉదయం 9.15 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారి తెలిపారు. ఈ ఘటనపై జరిగిన సమయంలో సీఎం విజయన్ క్లిఫ్ హౌస్‌లో లేరని సమాచారం. ఆయన అప్పటికే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లారని తెలుస్తోంది.
Add Asianetnews Telugu as a Preferred Source

ఔట్‌పోస్టు వద్ద భద్రతా అధికారి సర్వీస్ వెపన్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. క్లిఫ్ హౌస్ హైసెక్యూరిటీ జోన్ కావడంతో ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Scroll to load tweet…
