రెజ్లర్లు లేవనెత్తిన సమస్యలు పరిష్కారం అయితేనే తాము ఆసియా క్రీడల్లో పాల్గొంటామని రెజ్లర్ సాక్షి మాలిక్ స్పష్టం చేశారు. తమ బాధలు ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అన్నారు. శనివారం ఆమె సోనిపట్ కు చేరుకున్న సందర్భంగా మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. 

తమ సమస్యలు పరిష్కారమైతేనే ఆసియా క్రీడల్లో పాల్గొంటామని రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నారు. హర్యానాలోని సోనిపట్ లో మీడియాతో మాట్లాడిన మాలిక్.. రెజ్లర్లు మానసికంగా రోజు రోజుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కానీ ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదని తెలిపారు. ‘‘ఈ సమస్యలన్నీ పరిష్కారమైతేనే ఆసియా క్రీడల్లో పాల్గొంటాం. మానసికంగా మనం ప్రతిరోజూ ఏం అనుభవిస్తున్నామో అర్థం కావడం లేదు’’ అని ఆమె రెజ్లర్ల భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి మహాపంచాయత్ లో పాల్గొనేందుకు సోనిపట్ కు వచ్చిన సందర్భంగా మీడియాతో చెప్పారు.

తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ.. గ్రాండ్ గా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

కాగా.. లైంగిక వేధింపులకు దారితీసిన ఘటనను పునర్నిర్మించడానికి రెజ్లర్ సంగీతా ఫోగట్ ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధికారిక నివాసానికి తీసుకువచ్చారు. ఫోగట్ వెంట మహిళా పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 గంటలకు మహిళా అధికారులు సంగీతా ఫోగట్ ను ఢిల్లీలోని బ్రిజ్ భూషణ్ అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. అరగంట సేపు అక్కడే ఉన్నారు. ఆ సన్నివేశాన్ని రీక్రియేట్ చేయాలని, వేధింపులు ఎదుర్కొన్న ప్రదేశాలను గుర్తు చేసుకోవాలని పోలీసులు ఆమెను కోరారని ‘ఏబీపీ’న్యూస్ పేర్కొంది. 

Scroll to load tweet…

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ లోని కైజర్గంజ్ బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులను దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వచ్చే వారంలో తన నివేదికను కోర్టులో సమర్పించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా 180 మందిని సిట్ ఇంటర్వ్యూ చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

రైల్వే ట్రాక్ పై చెక్క దుంగ విసిరిన దుండగుడు.. అప్రమత్తమై రైలును ఆపిన లోకో పైలెట్.. నిందితుడి అరెస్ట్

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన వినేశ్ ఫోగట్, ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా వంటి భారతదేశంలోని ప్రసిద్ధ రెజ్లర్లు సింగ్ ను అరెస్టు చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మే 28వ తేదీ వరకు వారంతా నిరసన తెలిపారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రాంగణానికి వెళ్లేందుకు రెజ్లర్లు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

రెజ్లర్లు జూన్ 3వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవ్రత్ కడియన్‌లు అమిత్ షాతో భేటీ అయిన వారిలో ఉన్నారు. ఆరోజు రాత్రి 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. గంటపాటు సాగింది. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాతో డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమేనని అమిత్ షా వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అని వారితో అన్నారు.

విషాదం.. తొమ్మిది అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 85 ఏళ్ల వృద్ధుడు మృతి..

జూన్ 7వ తేదీన రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కూడా రెజర్లు సమావేశం అయ్యారు. అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. రెజ్లర్లతో సానుకూలంగా చర్చించామని, పదవీ విరమణ చేస్తున్న సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన చార్జిషీట్ ను జూన్ 15లోగా దాఖలు చేస్తామని తెలిపారు.