తమిళనాడులో గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఓ తాగుబోతు మత్తులో 20 కిలోల బరువు, 3 అడుగుల బరువున్న చెక్క దుంగను రైల్వే ట్రాక్ పై విసిరాడు. అయితే దీనిని గమనించి లోక్ పైలెట్ రైలును నిలిపివేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

తమిళనాడులోని నెమిల్లిచ్చేరి సమీపంలో రైల్వే ట్రాక్ పై చెక్క దుంగను ఉంచిన 42 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ దుండుగుడు ట్రాక్ పై ఉంచిన దుంగను దూరం నుంచే గూడ్స్ రైలు ఇంజన్ లోకో పైలెట్ గమనించింది. దీంతో వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. దీంతో గూడ్స్ రైలు ఇంజిన్ దూరం నుంచి దుంగను గుర్తించి దుంగను ఢీకొనేలోపే రైలును ఆగిపోయింది.

విషాదం.. తొమ్మిది అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 85 ఏళ్ల వృద్ధుడు మృతి..

బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంజిన్ తిరునుండ్రావూరు నుంచి నెమిలిచేరి వైపు వెళ్తుండగా తిరునిండ్రవూరుకు చెందిన వి.బాబు అనే వ్యక్తి మద్యం మత్తులో పట్టాలపై దుంగ విసిరాడని చెప్పారు. ఈ దుంగ సుమారు 20 కిలోలు, 3 అడుగుల పొడవు ఉందని రైల్వే పోలీసు వర్గాలు తెలిపాయి. పట్టాలపై ఉన్న దుంగను తొలగించిన తర్వాత లోకో పైలట్ ఆవడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

లోకో పైలెట్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఘనటపై రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 150 (1) (ఎ) (ఏదైనా కలప, రాయి లేదా ఇతర వస్తువులు లేదా వస్తువును రైల్వే ట్రాక్‌పై ఉంచడం) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఎన్సీపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించిన శరద్ పవార్.. ఎవరంటే ?

కాగా.. ఈ ఘటనకు పాల్పడిన బాబుకు ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనతో రైల్వే ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే ట్రాక్ ల పక్కన ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైల్వే ట్రాక్ ల దగ్గర ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.

ఇటీవల ప్రేయసి తనతో మాట్లాడటం లేదనే కోపంతో ఓ యువకుడు ట్రైన్ సిగ్నల్ ధ్వంసం చేసిన ఘటన ఇదే తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పత్తూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఆ యువకుడి వింత చర్య ఎందరినో ఆందోళనకు గురి చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం తిరుప్పత్తూర్‌ స్టేషన్‌లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులందరూ తమ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తిరుప్పత్తూరు బ్రాన్‌లైన్‌కు చెందిన 30 ఏళ్ల గోకుల్‌ ఆ స్టేషన్ కు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న రైలు సిగ్నల్ పోల్ వద్దకు వెళ్లాడు. సిగ్నల్స్ ను సూచించే లైట్లను రాళ్లతో కొట్టాడు. దీంతో అవి పగిలిపోయాయి. 

గాంధీని గాడ్సే చంపినా.. ఈ దేశ కుమారుడే, కానీ ఔరంగజేబులా ఆక్రమణదారుడు కాదు - బీజేపీ నేత గిరిరాజ్ సింగ్

యువకుడు సిగ్నల్ లైట్లపై దాడి చేయడంతో ఆ చుట్టుపక్కలే ఉన్న పోలీసులకు శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడి చర్యను అడ్డుకొని వెంటనే అదుపులోకి తీసుకున్నాడు. ఆ సమయంలో ఆ యువకుడు మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డావని పోలీసులు విచారించడంతో.. తన ఓ యువతిని ప్రేమించానని చెప్పాడు. అయితే ఆమె తనతో మాట్లాడటం లేదని, అందుకే కోపం వచ్చి సిగ్నల్ ను ధ్వంసం చేశానని తెలిపాడు.