దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జన సాంద్రత అధికంగా ఉండే ద్వారక ప్రాంతంలోని ఓ తొమ్మిది అంతస్తుల భవనంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు చనిపోయాడు. 

ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ద్వారకా ప్రాంతంలో ఉన్న ఓ తొమ్మిది అంతస్తుల భవనంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 85 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఢిల్లీ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి రూ.లక్ష నష్టపరిహారం ప్రకటించింది. 

ఎన్సీపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించిన శరద్ పవార్.. ఎవరంటే ?

ద్వారకా ప్రాంతంలో ఉన్న తొమ్మిది అంతస్తుల భవనంలో శనివారం ఒక్క సారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు మొదలయ్యాయి. ఇవి వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

కానీ అప్పటికే మంటలు చెలరేగడంతో భవనానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే గుర్తుతెలియని 85 ఏళ్ల వృద్ధుడు భవనం పై అంతస్తులో ఇరుక్కుపోయాడు. మంటలతో ఏర్పడిన వేడిని తట్టుకోలేక, పొగ పీల్చడం వల్ల ఆయన మృతి చెందాడు. ఈ అగ్నిప్రమాదంలో పలువురు గాయాలు కూడా అయ్యాయి. 

ఒడిశా రైలు ప్రమాదం.. బోగీల నుంచి దుర్వాసన వస్తోందని స్థానికుల ఆందోళన.. అధికారులు ఏం చెప్పారంటే ?

కాగా.. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారుల ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్రమాదంపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ప్రకటించింది. 

గాంధీని గాడ్సే చంపినా.. ఈ దేశ కుమారుడే, కానీ ఔరంగజేబులా ఆక్రమణదారుడు కాదు - బీజేపీ నేత గిరిరాజ్ సింగ్

ఇదిలా ఉండగా.. ఈ అగ్నిప్రమాదంతో ఢిల్లీలో ఫైర్ సేఫ్టీపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో అధిక జనసాంద్రత, అగ్నిమాపక నియమావళికి అనుగుణంగా లేని అనేక పురాతన భవనాలు ఉన్నాయి. అయితే ఫైర్ సేఫ్టీ ప్రాముఖ్యతను ఈ అగ్నిప్రమాదం గుర్తు చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.