Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ శాంతి విషయంలో రాజీపడబోం - సీఎం భగవంత్ మాన్

ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అయితే ఈ విషయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మొదటి సారిగా స్పందించారు. పంజాబ్ రాష్ట్ర శాంతి విషయంతో తమ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. 

We will not compromise on Punjab's peace - CM Bhagwant Mann.. ISR
Author
First Published Mar 21, 2023, 1:43 PM IST

పంజాబ్ రాష్ట్రంలో శాంతి విషయంలో తమ ప్రభుత్వం రాజీపడబోదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, సీఎం భగవంత్ మాన్  అన్నారు. తాను అభివృద్ధి రాజకీయాలు చేస్తానని, మత రాజకీయాలు చేయనని అననారు. పరారీలో ఉన్న వేర్పాటువాద నాయకుడు, ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఆయన స్పందించడం ఇదే తొలిసారి.

అక్రమ సంబంధానికి అడ్డుపడిన తమ్ముడిని హత్యచేసిన అక్క.. సరస్సులో తలకోసం వెతుకుతున్న పోలీసులు

గత కొన్ని రోజులుగా కొన్ని శక్తులు విదేశీ శక్తుల సహాయంతో పంజాబ్ వాతావరణాన్ని చెడగొట్టేలా మాట్లాడుతున్నాయని, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాయని సీఎం అన్నారు. వారిపై చర్యలు తీసుకున్నామని, వారిని అరెస్టు చేశామని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది.

ఖలిస్తాన్ అనుకూల ‘‘వారిస్ పంజాబ్ దే’’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు జరుగుతున్న వేట మంగళవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఆ రాడికల్ లీడర్ మేనమామ హర్జీత్ సింగ్ ను ఈ ఉదయం అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించగా, అమృత్ పాల్ ఇంకా పరారీలో ఉన్నాడు. వారిస్ పంజాబ్ దే సంస్థ సభ్యులపై అణచివేత ఫలితంగా ఇప్పటివరకు మొత్తం 114 మందిని అరెస్టు చేసినట్లు పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్క్వార్టర్స్) సుఖ్చైన్ సింగ్ గిల్ తెలిపారు.

ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఫారీన్ పార్టీ.. బీజేపీ: ప్రముఖ అమెరికా పత్రికా వాల్‌స్ట్రీట్ జర్నల్

‘వారిస్ పంజాబ్ దే’ లో ఐఎస్ఐ కోణం, విదేశీ నిధులపై పోలీసులకు బలమైన అనుమానం ఉందన్నారు. అమృత్ పాల్ మేనమామ హర్జీత్ సింగ్ తో పాటు ఐదుగురిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ ఎస్ ఏ) ప్రయోగించామని,  ఇది దేశవ్యాప్తంగా ఏ జైలులోనైనా అనుమానితులను నిర్బంధించడానికి పోలీసులను అనుమతిస్తుందని పంజాబ్ పోలీసులు సోమవారం పేర్కొన్నారు.

ధ్వంసం చేసానన్న సెల్ ఫోన్లు ఇవే..: ఈడికే షాక్ ఇచ్చిన కవిత

కాగా.. అమృత్ పాల్ సింగ్ ను విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై పంజాబ్, హరియాణా హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. అమృత్ పాల్ పోలీసుల అక్రమ కస్టడీలో ఉన్నాడని వారిస్ పంజాబ్ దే లీగల్ అడ్వైజర్ ఇమాన్ సింగ్ ఖారా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తారన్ తరన్, ఫిరోజ్ పూర్, మోగా, సంగ్రూర్, అమృత్సర్ లోని అజ్నాలా సబ్ డివిజన్, మొహాలీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలపై సస్పెన్షన్ ను పంజాబ్ ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం వరకు పొడిగించింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలు యథావిధిగా పనిచేయనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios