సారాంశం

పాకిస్థాన్ కూడా హిందూ దేశంగా మారుస్తామని బాగేశ్వర్ ధామ్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య ధీరేంద్ర శాస్త్రి  అన్నారు. అయోధ్య సమస్య తీరిపోయిందని, ఇప్పుడు మథుర వంతు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు సనతానీలు మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని పిలుపునిచ్చి వార్తల్లో నిలిచిన బాగేశ్వర్ ధామ్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య ధీరేంద్ర శాస్త్రి తాజాగా పాకిస్తాన్ ను కూడా హిందూ దేశంగా మారుస్తామని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఓ బహిరంగ సభ (దివ్య దర్బార్)లో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ.. ప్రజలు ఏకమైతే పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చవచ్చని అన్నారు. ‘‘... గుజరాత్ ప్రజలు ఇలాగే ఏకమైన రోజు, భారతదేశాన్నే కాదు.. పాకిస్తాన్ ను కూడా హిందూ దేశంగా మారుస్తాం..’’ అని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు రాముడు, హిందుస్థాన్ అవసరమని ఆయన అన్నారు.

యువతితో లేచిపోయిన యువకుడు..పెళ్లి చేస్తామని పిలిచి ముఖానికి నల్లరంగు పూసి, బూట్ల దండతో ఊరేగింపు.. వీడియో వైరల్

ఈ సమావేశంలో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ.. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడం ఎలా సాధ్యమవుతుందని తరచూ తనను కొందరు అడుగుతున్నారని చెప్పారు. భారత్ ఇప్పటికీ హిందూ దేశమే అని, అది అలాగే కొనసాగుతుందని అన్నారు. అయోధ్య తర్వాత (రామ మందిర సమస్యను ప్రస్తావిస్తూ) ఇప్పుడు మథుర వంతు వచ్చిందని, కాబట్టి సనతానీలు మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోని ముఖ్యాంశాల్లో నిలిచే.. ధీరేంద్ర శాస్త్రి ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాగే మాట్లాడారు. తన అనుచరులు తనకు మద్దతిస్తే ‘హిందూ రాజ్యం’ ఇస్తామని హామీ ఇచ్చారు. భారతదేశం హిందూ దేశంగా మారాలనే డిమాండ్ పై ఆయన గళమెత్తారు. భారతదేశం హిందూ దేశంగా మారిన రోజు మాత్రమే ‘లవ్ జిహాద్’ కేసులు ఆగిపోతాయని కూడా చెప్పారు.

మానవత్వం చూపించిన సీఎం సిద్ధరామయ్య.. హత్యకు గురైన బీజేపీ నేత భార్యకు మళ్లీ ఉద్యోగమిస్తామని ప్రకటన

ఏప్రిల్ మొదట్లో కూడా సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా దేవుడు కాదని, ఒక ఫకీరు మాత్రమే అని అన్నారు. సాయిబాబాకు శంకరాచార్యులు దైవస్థానం ఇవ్వలేదని ధీరేంద్ర శాస్త్రి చెప్పారు. ‘‘శంకరాచార్యులు మన ధర్మానికి ప్రధాని కాబట్టి ఆయనను గౌరవించడం ప్రతీ సనాతనీ కర్తవ్యం. గోస్వామి తులసీదాస్ జీ అయినా, సూర్దాస్ జీ అయినా మన ధర్మానికి చెందిన ఏ సాధువు అయినా కానివ్వండి.. ఆయనను గొప్ప వ్యక్తి, యుగ పురుషుడు, కల్ప పురుషుడు అనొచ్చు. కానీ దేవుడు అనలేం’’ అని అన్నారు. అయితే ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. ఎవరి నమ్మకాన్ని దెబ్బతీయలేమని, కానీ సాయిబాబా సాధువు, ఫకీరు కావచ్చు కానీ దేవుడు కాలేరని అన్నారు.

ఇదిలా వుండగా, ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి వై-కేటగిరీ భద్రత లభించింది. ఇటీవల ఆయన కార్యక్రమాలకు భారీగా తరలివచ్చిన వారిని దృష్టిలో ఉంచుకుని భద్రత కల్పించారు. తమ రాష్ట్రంలో బాగేశ్వర్ ధామ్ చీఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయనకు కూడా అదే స్థాయి భద్రత కల్పించాలని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది.

సెంగోల్ మొదటి రోజే వంగిపోయింది - ఎంకే స్టాలిన్.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన తమిళనాడు సీఎం

ధీరేంద్ర శాస్త్రి జూన్ 7 వరకు గుజరాత్ లోని నాలుగు నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సూరత్ తర్వాత అహ్మదాబాద్, రాజ్ కోట్, వడోదరలో కూడా ఆయన తన ప్రవచనలాను నిర్వహించనున్నారు. మే 29, 30 తేదీల్లో అహ్మదాబాద్ లో, జూన్ 1, 2 తేదీల్లో రాజ్ కోట్ లో, జూన్ 3 నుంచి 7 వరకు వడోదరలో దర్బార్ ఏర్పాటు చేయనున్నారు.