Asianet News TeluguAsianet News Telugu

మూడు నెలల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రధాని అభ్యర్థిని ఖరారు చేస్తాం - బీహార్ సీఎం నితీష్ కుమార్

తాను ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రధాని అభ్యర్థిని కాను అని జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ మరో సారి స్పష్టం చేశారు. రెండు, మూడు నెలల్లో దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు. 

We will finalize the prime ministerial candidate from the opposition parties in three months - Bihar CM Nitish Kumar
Author
First Published Sep 9, 2022, 2:11 PM IST

2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సాగిన త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అయ్యింద‌ని జనతాదళ్ (యునైటెడ్) చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. కాషాయ ద‌ళానికి వ్య‌తిరేకంగా పోరాడే ప్ర‌య‌త్నంలో భాగంగా తాను ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను క‌లిశాన‌ని పేర్కొన్నారు. గురువారం పాట్నాకు తిరిగి వచ్చిన నితీష్ కుమార్ నేరుగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత రబ్రీ దేవి నివాసానికి వెళ్లి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు.

సోనాలిఫోగ‌ట్ మృతి కేసు: గోవాలోని కర్లీ రెస్టారెంట్ కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రెండు మూడు నెలల్లో ప్ర‌తిపక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఖరారు చేస్తామని చెప్పారు. ‘ప్రతిపక్ష నేతలను ఏకం చేసేందుకు నా పని నేను చేస్తున్నాను. నా ప్రయత్నాలు కొనసాగుతాయి. త్వరలో ప్రతిపక్ష నేతలు ఏకమవుతారని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అందరూ సహకరిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రధానమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం రెండు మూడు నెలల్లో వస్తుంది. ప్రస్తుత అయితే నేను ప్రతిపక్ష పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థిని కాను ’’ అని ఆయన అన్నారు.

బీజేపీ గత విధానాలకు దూరమైందని, పూర్తిగా మారిపోయిందని కుమార్ ఆరోపించారు. ‘‘ బీజేపీ ఇప్పుడు మారిన పార్టీ. ఇది అటల్ జీ కాలంలో ఉన్న బీజేపీ కాదు. బీజేపీ విధానాలు, కథనాలు ఇప్పుడు మారాయి ’’ అని బీహార్ సీఎం పేర్కొన్నారు. తన విమర్శలు చేసిన వారిపై మండిపడిన నితీష్ కుమార్.. తమ పార్టీ, ప్రభుత్వం అభివృద్ధి పనులును చేపట్టడాన్ని విశ్వసిస్తుందని అన్నారు.

ప్రజలను కలుసుకొనేందుకే భారత్ జోడో యాత్ర: బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

తాను బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 4.3గా ఉందని, ఇప్పుడు బాలికల విద్య కారణంగా అది 2.9కి చేరుకుందని చెప్పారు. తాము దేశం కోసం కూడా ప‌ని చేస్తామ‌ని, ప‌బ్లిసిటీ కోసం ప‌ని చేయ‌బోమ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సాధించిన విజ‌యాల‌ను ప్ర‌స్తావించారు. 

కాగా.. నితీష్ కుమార్ త‌న ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లెఫ్ట్ నేత సీతారాం ఏచూరి, హర్యానా మాజీ సీఎం ఓపీ చౌతాలా, సమాజ్ వాదీ పార్టీ నేత‌లు నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తదితరులతో భేటీ అయ్యారు.

ఆ బాలుడు కాలేయాన్ని ఎలా దానం చేయ‌గ‌ల‌డు? యూపీ సర్కారుకు సుప్రీం నోటీసులు

ఇదిలా ఉండ‌గా.. గ‌త నెల ప్రారంభంలో నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సంబంధాలు తెంచుకున్నారు. ఆర్జేడీ, ఇత‌ర పార్టీల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ప్ర‌భుత్వంలో కూడా జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కాగా.. ఈ ప‌రిణామాల ప‌ట్ల బీజేపీ తీవ్రంగా మండిప‌డింది. జేడీ(యూ) నాయ‌కుడు ఆర్జేడీతో చేతులు క‌ల‌ప‌డం వ‌ల్ల బీహార్ ను అరాచకం, అవినీతి యుగంలోకి నెట్టారని ఆ పార్టీ ఆరోపించింది. అయితే నితీష్ కుమార్ తీసుకున్న ప‌రిణామం ప‌ట్ల బీజేపీ వ్య‌తిరేక పార్టీలు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. నితీష్ కుమార్ ను ప్ర‌తిప‌క్ష పార్టీల త‌రుఫున పీఎం అభ్య‌ర్థిగా ఉండాల‌ని కోరుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చేసిన ఢిల్లీ టూర్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios