దేశంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు.  తమిళనాడులోని నాగర్ కోయిల్ శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర ఇవాళ్టికి మూడో రోజుకు చేరుకుంది.  

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ నష్టంపై ప్రజలను చైతన్యం చేయడానికి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించారు.

రాహు ల్ గాంధీ పాదయాత్ర ఇవాళ్టికి మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజుల క్రితం కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ లో రాహుల్ గాంధీ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.ఈ పాదయాత్రతో దేశ ప్రజలను అర్ధం చేసుకొనే అవకాశం దక్కుతుందని రాహుల్ గాంధీ చెప్పారు.పాదయాత్రకు తాను నాయకత్వం వహించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ యాత్రలో పాల్గొంటున్నట్టుగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

also read:భారత్ జోడో యాత్ర: రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వర ఆలయం నుండి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం

బీజేపీ విధానాల వల్ల దేశానికి నష్టం జరుగుతుందన్నారు.దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీనాశనం చేసిందని ఆయన ఆరోపించారు. విపక్షాలపై సీబీఐ, ఈడీలను బీజేపీ ఉసిగొల్పుతుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తన పాదయాత్రపై ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చన్నారు.