Asianet News TeluguAsianet News Telugu

ఆ బాలుడు కాలేయాన్ని ఎలా దానం చేయ‌గ‌ల‌దు? యూపీ సర్కారుకు సుప్రీం నోటీసులు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు..  తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి కాలేయాన్ని దానం చేయాలనుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో అనుమతి కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ బాలుడు  పిటిషన్‌పై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి స్పందన కోరింది. 

17 Years old Son Wants To Donate Liver To his Father, Seeks Permission From SC
Author
First Published Sep 9, 2022, 1:44 PM IST

ఓ బాలుడు దాఖాలు చేసిన‌ విచార‌ణ‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి.. స్పందన కోరింది. ఆ బాలుడి తండ్రి ఆరోగ్యం ప‌రిస్థితి విష‌మించింది. అత‌ని ప్రాణాలు కాపాడాలంటే.. కాలేయ మార్పిడి చేయాలి. ఈ క్ర‌మంలో  ఆ బాలుడు తన కాలేయాన్ని తన తండ్రికి దానం చేయాలను కుంటున్నాడు. అయితే.. ఆ బాలుడు చిన్నవాడు కాబట్టి.. దేశంలోని అవయవ దాన చట్టాలు ప్రతిబంధకంగా మారవచ్చు.
 
వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడి తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. 
ఆయ‌న‌ తండ్రికి కాలేయం పూర్తిగా ప‌డైపోయింది. రోజురోజుకు అతని పరిస్థితి విషమిస్తుంది. క‌చ్చితంగా  కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్ర‌మంలో బాలుడు కోర్టును ఆశ్ర‌యించాడు. తన కాలేయాన్ని తన తండ్రికి దానం చేయాలనుకుంటున్నాన‌ని,  తన కాలేయాన్ని దానం చేయడానికి అనుమతించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖాలు చేశాడు. 

ఆ బాలుడు దాఖాలు చేసిన సుప్రీంకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. సుప్రీంకోర్టు సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆ బాలుడి పిటిషన్‌ను విచారించింది. ఈ పిటిష‌న్ పై వాదనలను విన్న సుప్రీంకోర్టు... 17 ఏళ్ల బాలుడు కాలేయాన్ని  ఎలా దానం చేయగలడంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖకు నోటీసులు జారీ చేసింది.  

ఈ షిటిష‌న్ త‌దుపరి విచారణను సెప్టెంబర్ 12 వాయిదా వేసింది. ఆ రోజు యూపీ ఆరోగ్య శాఖ అధికారిని కోర్టు హాజరు కావాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. అస‌లు 17 ఏండ్ల బాలుడు కాలేయాన్ని దానం చేయవచ్చా? లేదా? అనేది మైనర్‌కు ప్రాథమిక పరీక్ష చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీని రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్య కార్యదర్శికి తెలియజేయాలని కోరింది. ఆ బాలుడి తండ్రి ప్రాణాలు కాపాడాలంటే కాలేయం కావాలి. పిల్లవాడు.. చిన్నవాడు కాబట్టి.. దేశంలోని అవయవ దాన చట్టాలు ప్రతిబంధకంగా మారవచ్చు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి ప్రాణాలను కాపాడాలన్న  ఆ బాలుడి ఆకాంక్షపై  రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios