Asianet News TeluguAsianet News Telugu

సోనాలిఫోగ‌ట్ మృతి కేసు: గోవాలోని కర్లీ రెస్టారెంట్ కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే

Sonali Phogat death case: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతితో ముడిపడి ఉన్న గోవాలోని క‌ర్లీ రెస్టారెంట్ కూల్చివేతపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.
 

Sonali Phogat death case: Supreme Court stays demolition of Curly restaurant in Goa
Author
First Published Sep 9, 2022, 1:54 PM IST

Sonali Phogat death case: హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ మృతితో సంబంధం క‌లిగివున్న గోవాలోని క‌ర్లీ రెస్టారెంట్ కూల్చివేతపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అత్యవసర విచారణను మంజూరు చేసిన తర్వాత, గోవాలోని కర్లీ రెస్టారెంట్ కూల్చివేతపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కోస్టల్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ రెస్టారెంట్ కూల్చివేతకు ఆదేశించింది. బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మరణానికి సంబంధించిన లింక్‌తో ఈ రెస్టారెంట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో ఫోగట్‌కు మత్తు మందు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలను ఉల్లంఘించినందుకు గోవా ప్రభుత్వం శుక్రవారం ఉదయం వివాదాస్పద రెస్టారెంట్‌ను కూల్చివేయడం ప్రారంభించిందని ఒక అధికారి తెలిపారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) యూయూ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కూల్చివేతపై స్టే విధించింది. అయితే అధికారుల నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని యజమానులను ఆదేశించింది. బుధవారానికి సమాధానం ఇవ్వాలని గోవా ప్రభుత్వానికి నోటీసు జారీ చేసి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. సెప్టెంబరు 8న ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ అయ్యాయని, మరుసటి రోజు శుక్రవారం కూల్చివేత ప్రారంభమైందని రెస్టారెంట్ తరఫు సీనియర్ న్యాయవాది అహ్మదీ ధర్మాసనానికి తెలిపారు. ఎన్‌జీటీ  ముందు ఈడీ విచారణ జరిగిందని, ఈ ఆస్తి 1991 నుంచి ఉనికిలో ఉందని, అప్పటి నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. ఈ ప్రకటనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, రెస్టారెంట్‌లోని పాత గుడిసె అయిన ప్లాట్ 42/10గా గుర్తించిన ఆస్తిని మాత్రమే కూల్చివేయబోమని స్పష్టం చేసింది. అంజునా వద్ద ఏదైనా ఇతర అనధికార నిర్మాణాన్ని కూల్చివేయవచ్చని పేర్కొంది. సాధారణంగా కూల్చివేతలపై స్టే ఉండదని కోర్టు స్పష్టం చేసింది.

కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే వరకు రెస్టారెంట్ ను మూసివేయాలనీ, సెప్టెంబర్ 16వ తేదీని తదుపరి విచారణ తేదీగా నిర్ణయించాలని కోర్టు ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా NGT నుండి ఎటువంటి ఉపశమనం పొందడంలో దాని యజమాని విఫలమవడంతో గోవా ప్రభుత్వం రెస్టారెంట్‌ను కూల్చివేయడం ప్రారంభించింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు గుడిసెను కూల్చివేయాలని గోవా కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ గతంలో ఇచ్చిన ఆదేశాలను గురువారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బాడీ సమర్థించింది.

ఈ ఉదయం, దాని కూల్చివేత కోసం రెస్టారెంట్ వెలుపల భారీ పోలీసు బందోబస్తు కనిపించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి 'నో డెవలప్‌మెంట్ జోన్'లో నిర్మించిన రెస్టారెంట్‌ను కూల్చివేసేందుకు జిల్లా యంత్రాంగం కూల్చివేత స్క్వాడ్ పోలీసు సిబ్బందితో కలిసి ఉదయం 7.30 గంటలకు బీచ్‌కు వచ్చారు. గోవాలోని ప్రసిద్ధ అంజునా బీచ్‌లో ఉన్న రెస్టారెంట్, సోనాలి ఫోగ‌ట్ చనిపోవడానికి గంటల ముందు సోనాలి ఫోగట్ అక్కడ పార్టీ చేసుకోవడంతో రెస్టారెంట్ వార్త‌ల్లో నిలిచింది. ఈ కేసులో అరెస్టయిన నలుగురిలో దాని యజమాని ఎడ్విన్ నూన్స్ కూడా ఉన్నాడు. అనంతరం ఆయనకు బెయిల్ పై విడుద‌ల‌య్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోనాలి ఫోగట్ తన మరణానికి ముందు రెస్టారెంట్‌లో మందు తాగినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆమె మరణానికి గంటల ముందు కర్లీ రెస్టారెంట్‌లో ఆమె సహచరులు ఆమెకు వినోద ఔషధం, మెథాంఫేటమిన్ లేదా 'మెత్' అందించారని పోలీసులు తెలిపారు. వారు హోటల్‌కు బయలుదేరే ముందు ఆమెను బలవంతంగా ఒక ర‌క‌మైన పానీయం తాగించారని వారు చెప్పారు. ఆమె మరుసటి రోజు ఉదయం, ఆగస్టు 23న ఒక ఆసుపత్రిలో మరణించింది. ఇది మొదట్లో గుండెపోటు కేసుగా భావించబడింది, కానీ కుటుంబం అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ చేయ‌గా అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios