పార్లమెంటు ప్రారంభోత్సవానికి మేము వస్తాం.. ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించిన రెండు పార్టీలు.. ఏవంటే ?
పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి తాము వస్తామని ఒడిశా అధికార పార్టీ బీజేడీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ హాజరవుతామని ప్రకటించాయి. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ధృవీకరించాయి.
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారింది. ప్రధాని ఈ భవనాన్ని ప్రారంభిస్తానని ప్రకటించడంతో అనేక పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు తేల్చిచెప్పాయి. దాదాపు 19 ప్రతిపక్ష పార్టీలు ఈ వేడుకకు హాజరుకాబోమని ప్రకటించాయి. అయితే ఈ క్రమంలో ఓ రెండు పార్టీలు మాత్రం తాము ఈ వేడుకకు వస్తామని బుధవారం తెలిపాయి. ఒడిశా అధికార పార్టీ అయిన బిజూ జనతాదళ్, ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీలు రెండూ ప్రారంభోత్సవానికి హాజరు అవుతామని ప్రకటించాయి.
2024 జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ప్రజలను ఆహ్వానించిన యోగి ఆదిత్యనాథ్
ఈ పార్లమెంటు ప్రారంభోత్సవంలో తమ పార్టీ ఎంపీలు పాల్గొంటారని బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి ఓ లేఖ విడుదల చేశారు. అందులో ‘‘ప్రజాస్వామ్యానికి చిహ్నంగా పార్లమెంటు రాజకీయాలకు అతీతమైనది. దాని అధికారాన్ని, ప్రతిష్ఠను ఎల్లప్పుడూ కాపాడాలని పార్టీ భావిస్తోంది. ఈ రాజ్యాంగ సంస్థలు తమ పవిత్రతను, గౌరవాన్ని దెబ్బతీసే ఏ సమస్యకైనా అతీతంగా ఉండాలని బీజేడీ విశ్వసిస్తోంది. ఇలాంటి అంశాలపై సభలో ఎప్పుడూ చర్చించుకోవచ్చు. భారత రాష్ట్రపతి భారత రాజ్యానికి అధిపతి. ఈ పార్లమెంటు భారతదేశంలోని 1.4 బిలియన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రెండు సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి చిహ్నాలు అని, భారత రాజ్యాంగం నుంచి తమ అధికారాన్ని పొందుతాయి.’’ అని పేర్కొన్నారు. కాగా.. ఆ పార్టీకి లోక్ సభలో 12 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. కాగా.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో పర్యటించిన రెండు వారాల తర్వాత బీజేడీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణం - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అలాగే వైసీపీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుందని ధృవీకరించింది. 2014 జూన్ లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు గతంలో ఎన్నడూ లేనంత భారీ నిధులకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కేంద్రం తరఫున ఉంటోందని తెలుస్తోంది. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో కేంద్ర విధానాలకు మద్దతిస్తూ వస్తున్నారు. కొన్ని ఎంపిక చేసిన సందర్భాల్లో మాత్రమే ప్రతిపక్షం వైపున ఉంటున్నారు.
ఇదిలా ఉండగా.. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ) హాజరును ధృవీకరించగా, శివసేన (షిండే వర్గం), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఏఐఏడీఎంకే (ఏఐఏడీఎంకే) వంటి మరికొన్ని పార్టీలు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఆప్ లతో పాటు ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), శివసేన (యూబీటీ), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), భారత కమ్యూనిస్ట్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్ డీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జేడీ) తదితర పార్టీలు బహిష్కరణ ప్రకటించాయి. కాగా.. దీనిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గురువారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అమెరికాలో మహబూబ్‌నగర్ యువకుడు మృతి.. ఏమైందంటే ?
ప్రతిపక్షాల నిర్ణయంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం దురదృష్టకరమన్నారు. ‘‘ఇది ఒక చారిత్రాత్మక ఘటన అని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. ఇది రాజకీయాలకు సమయం కాదు... బహిష్కరించడం, కొత్త సమస్య నుంచి సమస్యలు సృష్టించడం అత్యంత దురదృష్టకరం. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలి’’ అని విజ్ఞప్తి చేశారు.