గోవాలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తన వంద రోజుల పాలన కు సంబంధించిన నివేదికను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఓ బుక్ లెట్ ను ఆవిష్కరించారు. వంద రోజుల్లో అక్రమ మత మార్పిడిలపై ఉక్కుపాదం మోపామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కోస్తా రాష్ట్రంలో హిందువుల మత మార్పిడులు నిలిచిపోయాయని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. బుధవారం పనాజీలో జరిగిన ‘100 డేస్ ఆఫ్ యాక్షన్’ కార్యక్రమంలో భాగంగా ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం’ చేసిన అభివృద్ధిని ఒక బుక్ లెట్ రూపంలో బుధ‌వారం ఆయ‌న విడుద‌ల చేశారు. 

‘నా పెన్ను వెతికి పెట్టండి..’ కాంగ్రెస్ ఎంపీ పోలీస్ ఫిర్యాదు..

ఈ సంద‌ర్భంగా అనేక గ‌వ‌ర్న‌మెంట్ స్కీమ్స్ కోసం అప్ డేట్ చేసిన పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్, SMS ఇంటిమేషన్ సర్వీస్‌ను కూడా సీఎం సావంత్ ప్రారంభించారు. ప‌లువురు లబ్ధిదారులకు అటవీ హక్కుల చట్టం కింద భూమి హక్కుల సనద్‌ను పంపిణీ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ మత మార్పిడిపై మా ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంభిస్తోంది. హిందువుల మార్పిడిని మేము నిలిపివేసాం. ’’ అని అన్నారు. ఏళ్ల తరబడి జరుగుతున్న మత మార్పిడులు ఆగిపోయాయని.. అక్రమ భూసేకరణ వ్యవహారంపై సిట్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 

పదేళ్ల చిన్నారి దారుణహత్య, నోటికి టేప్ వేసి, మర్మాంగాలు కట్టేసి.. గోనెసంచిలో కుక్కి..

పోర్చుగీస్ కాలంలో ధ్వంసమైన దేవాలయాలు, వారసత్వ ప్రదేశాలను పునర్నిర్మించడం, పునరుద్ధరించడం కోసం బీజేపీ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను కేటాయించిందని సావంత్ చెప్పారు. పర్యాటక రంగానికి సంబంధించి, అన్ని రకాల అనుమతులను రెన్యువల్ చేయడానికి, ఆన్‌లైన్ లో పర్మిషనర్స్ ఇవ్వడానికి, రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. వాటాదారులకు సులభంగా వ్యాపారం చేసేందుకు ఈ సేవలను ప్రారంభించినట్లు ఆయ‌న అన్నారు.

Scroll to load tweet…

మూడు కోవిడ్-19 వేవ్ ల బారిన పడినప్పటికీ, గోవాలో పర్యాటక రంగం స్థిరమైన వృద్ధిని సాధించింద‌ని అన్నారు. గ‌త మూడు క‌రోనా వేవ్స్ లో 19,40,683 దేశీయ, 33,841 విదేశీ పర్యాటకులు మార్చి 2022 నుండి మే 2022 స‌మ‌యంలో గోవాను సందర్శించారు ’’ అని ఆయన అన్నారు.

మహారాష్ట్రలో దారుణం.. ముస్లిం సూఫీ బాబాను కాల్చి చంపిన దుండగులు..

2018 సంవత్సరంలో సుప్రీంకోర్టు రెన్యూవల్‌ని రద్దు చేసిన 88 లీజులను స్వాధీనం చేసుకోవడానికి, ఇతర లీజుల కోసం ఇ-వేలం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని గోవా ముఖ్యమంత్రి తెలిపారు. మైనింగ్ రంగం విషయంలో మాట్లాడుతూ ‘‘ ఈ విష‌యంలో ప్రభుత్వం యాక్టివ్ గా ఉంది. 88 లీజులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. మైనింగ్ లీజుల ఇ-వేలం ప్రక్రియను ప్రారంభించడానికి కూడా ఇది సిద్ధమైంది. ’’ అని తెలిపారు.