తమిళనాడులోని ఓ కాంగ్రెస్ ఎంపీ పోలీసులకు తన పెన్ను పోయిందని, వెతికి పెట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళనాడు : కుక్కపిల్ల పోయింది.. పిల్లి పోయింది.. అంటూ పోలీసులకు ఫిర్యాదు రావడం మామూలై పోయాయి. ఇటీవలి కాలంలో కోడి కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఉదంతాలూ విన్నాం. తాజాగా పెన్ను పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. అది కూడా ఎవరో చిన్నా, చితకా మనుషులు కాదు... ఓ ఎంపీ ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ తన pen lost అయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.పెన్ను కోసం పోలీస్ కంప్లైంట్ ఏంటి? ఆ పెన్ను అంత ఖరీదైనదా? లేకపోతే అంత సెంటిమెంట్? ఎంపీకి ఏమి పని లేదా? అనుకుంటున్నారా.. మీ అనుమానాల్లో ఒకటి నిజం.. ఆ పెన్ను విలువ దాదాపు రూ. లక్షా 50 వేలు ఉంటుందట. దాన్ని తన తండ్రి, మాజీ ఎంపీ వసంత కుమార్ జ్ఞాపకార్థంగా పెట్టుకున్నానని ఆయనే స్వయంగా వెల్లడించారు. చిన్నచిన్న వస్తువులే కానీ.. వాటితో ముడిపడి ఉన్న అనుబంధం, జ్ఞాపకాలు దాని విలువను పెంచేస్తాయి. అవి కనిపించకుండా పోతే.. జీవితంలో ఏంతో వెలితిగా అనిపిస్తుంది. అలాంటిదే జరిగింది ఎంపీ విషయంలో..
అసలేం జరిగిందంటే..
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ Vijay vasanth పెన్ను పోయింది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. అది మౌంట్ బ్లాంక్ ఫౌంటెన్ పెన్ అని.. దాని విలువ దాదాపు లక్షా 50 వేల రూపాయలు అని తెలిపారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జూలై 30న చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా గిండీలోని స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన పెన్నును ఎవరో దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పదేళ్ల చిన్నారి దారుణహత్య, నోటికి టేప్ వేసి, మర్మాంగాలు కట్టేసి.. గోనెసంచిలో కుక్కి..
‘మా నాన్న ఆ పెన్నును వాడేవారు. ఆయన చనిపోయాక.. దాదాపు రెండేళ్ల నుంచి ఆయన జ్ఞాపకార్థం ఆ పెన్నును నేను ఉపయోగిస్తున్నారు. ఇటీవల గిండీలో జరిగిన సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. అప్పుడు నా దగ్గర పెన్ను ఉంది. కొద్దిసేపటి తర్వాత కనిపించలేదు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, డీఎంకే కూటమిలోని సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బయటి వ్యక్తులు ఎవరూ రాలేదు. రద్దీ ఎక్కువగా ఉండడంతో జేబులోంచి నా పెన్ను జారి కిందపడిపోయి ఉండవచ్చు.
హోటల్ యాజమాన్యం సీసీటీవీ రికార్డును చెక్ చేయమని అడిగాను. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తామని హోటల్ యాజమాన్యం వారు తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెప్పుకొచ్చారు. అయితే, ఎంపీ వసంతకుమార్ పెన్నును ఎవరో దొంగిలించారని దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని చాలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీన్ని ఆయన ఖండించారు. ఇది నిజం కాదని.. పోయిందని.. మాత్రమే ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. త్వరలోనే పోలీసులు.. రికవరీ చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు వసంత కుమార్. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
