పదేళ్ల బాలుడిని టేపుతో నోరు మూసి, కాళ్లు బిగించి దారుణంగా హత్య చేసినట్లు కథువా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్‌సి కొత్వాల్ తెలిపారు.
కథువా : జమ్మూ కాశ్మీర్‌లోని Kathua జిల్లాలో 10 ఏళ్ల బాలుడు Brutal Murderకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు బుధవారం సమాచారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు చిన్నారులు సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. మృతుడు చిన్నారి ప్రణయ్ కుమార్ సైద్‌పూర్ గ్రామంలో ఉంటాడు. మంగళవారం ప్రైవేట్ ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఊరంతా వెతికారు.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామ శివార్లలోని పొదల్లో ఓ గోనె సంచి అనుమానితంగా కనిపించింది. దాన్ని పరిశీలించగా అందులో కనిపించకుండా పోయిన చిన్నారి విగతజీవిగా కనిపించాడు. బాలుడిని చంపేసి, శవాన్ని గొనెసంచిలో కుక్కి అక్కడ పారేశారని పోలీసు అధికారి తెలిపారు. బాలుడి నోటికి టేప్ అతికించి ఉంది.. మర్మాంగాలు కట్టివేసి ఉన్నాయి. బాలుడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
మహారాష్ట్రలో దారుణం.. ముస్లిం సూఫీ బాబాను కాల్చి చంపిన దుండగులు..
బాలుడిని అతి దారుణంగా హత్య చేసినట్లు కథువా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్‌సి కొత్వాల్ తెలిపారు. హత్య సమయంలో బాలుడు తప్పంచుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకించి ఉంటాడని.. అతని శరీరం మీదున్న గాయాల గుర్తులు పెనుగులాటను తెలుపుతున్నాయన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, రిపోర్ట్ వచ్చిన తరువాత గానీ.. మరణానికి ఖచ్చితమైన కారణం తెలియదని అధికారి తెలిపారు.
ఈ హత్యకు సంబంధించి పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబందించిన వివరాలు చెబుతూ..
"హత్యకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. వారిలో ఒకరు బాలుడి పొరుగింట్లో ఉండే పవన్ కుమార్ సైనీ, ఇతను మేజర్. మరో ముగ్గురు బాల్య నేరస్థులు," అని కొత్వాల్ అన్నారు. "ఇది చాలా ఘోరమైన నేరం. దీనిమీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం" అని కొత్వాల్ అన్నారు. శత్రుత్వమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.
