రైతు రుణాల కోసం బ్యాంకులకు మేం గ్యారెంటీ ఇచ్చాం.. కానీ కాంగ్రెస్ నిరాకరించింది - ప్రధాని మోడీ
రైతు సంక్షేమం కోసం, వారికి లబ్ధి చేకూర్చే పథకాలపై ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మరో సారి ఎన్డీఏకు అవకాశం ఇవ్వాలని కోరారు. రైతులు బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ నిరాకరించిందని ఆరోపించారు.
రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం హరియాణాలోని రేవారీలో పర్యటించారు. అక్కడ ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు చేశారు.
మంచి నిర్ణయమే.. కానీ చాలా లేటైంది - అసదుద్దీన్ ఒవైసీ
బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు రైతులకు కేంద్రం గ్యారంటీ ఇచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. కానీ ఆ హామీని అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిందని ఆరోపించారు. మరో సారి ఎన్డీఏకు అవకాశం ఇవ్వాలని, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రజలు మూడో సారి ఆశీర్వదించాలని కోరారు.
నూట పది రూపాయిలిచ్చి రోజూ నిలబడి పోవాల్నా..? బస్సులో యువకుడి ఆవేదన.. వైరల్
‘‘జీ20 సదస్సు విజయవంతమైందంటే దానికి కారణం మీ ఆశీర్వాదం. ఎవరికీ సాధ్యం కాని చోట భారత పతాకం చంద్రుడిపైకి చేరింది. మీ ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది. గత పదేళ్లలో భారత్ 11వ స్థానం నుంచి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మీ ఆశీస్సులు నాకు అవసరం.’’ అని అన్నారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి గైర్హాజరవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రధాని.. అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిరాన్ని నిర్మించాలని దేశం ఆకాంక్షించిందని అన్నారు. ఈ రోజు దేశం మొత్తం రామ్ లల్లాను బ్రహ్మాండమైన రామాలయంలో కూర్చోవడాన్ని చూస్తోందని అన్నారు. రాముడు ఊహాజనితుడని, రామ మందిరాన్ని నిర్మించాలని ఎప్పుడూ కోరుకోని కాంగ్రెస్ వాళ్లు కూడా ఇప్పుడు జై సియారామ్ అని నినదించడం ప్రారంభించారని ప్రధాని అన్నారు.
ఇదో కొత్త రకం చోరీ.. ఏటీఎంకు ప్లాస్టర్ అంటించి దొంగతనం.. ఎలాగంటే ?
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ హరియాణా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్సీ) అమలు చేయాలని, మరి కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు రాష్ట్ర సరిహద్దుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రధాని ఈ పర్యటన చేయడం గమనార్హం.