ఇదో కొత్త రకం చోరీ.. ఏటీఎంకు ప్లాస్టర్ అంటించి దొంగతనం.. ఎలాగంటే ?
ఏటీఎంకు ప్లాస్టర్ అంటించి నగదు చోరీ (Cash stolen from ATM by pasting plaster) చేసిన విచిత్ర ఘటన ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దొంగలు కూడా అప్ డేట్ అయ్యారు. పర్సులు కాజేయడం, ఇంట్లోని డబ్బులు దొంగతనం చేయడం రొటీన్ అయిపోయిందో ఏమో కొత్త రకం చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలో దొంగతనం చేయడమంటే మిషన్ ను బద్దలు కొట్టి నగదు ఎత్తుకెళ్లడమే మనకు తెలుసు. మిషిన్ ను ధ్వంసం చేయకుండా బ్యాంక్ సిబ్బందికి కూడా అనుమానం రాకుండా కూడా చోరీ చేసే ఘటన ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
మంచి నిర్ణయమే.. కానీ చాలా లేటైంది - అసదుద్దీన్ ఒవైసీ
ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని దస్నాపూర్ లో ఓ ఏటీఎం సెంటర్ ఉంది. అందులోకి స్థానిక బ్రాహ్మణవాడకు చెందిన సతీష్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి వెళ్లారు. మిషన్ లో కార్డు పెట్టి రూ.5 వేలు డ్రా చేశారు. కానీ ఎంతకూ డబ్బులు బయటకు రాలేదు. డబ్బులు బయటకు వచ్చే ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టర్ అతకపెట్టి ఉండటమే దానికి కారణం
మహాలక్ష్మి ఎఫెక్ట్.. బస్సుల్లో సీట్ల అమరికను మార్చేసిన ఆర్టీసీ.. ఎందుకో తెలుసా ?
ప్రస్తుత సందర్భంలో సతీష్ కు కూడా ఎలాంటి అనుమానమూ రాలేదు. కానీ డబ్బులు డ్రా చేసినా అవి బయటకు రాకపోవడం, రూ.5 వేలు కట్ అయినట్టు మెసేజ్ రావడంతో వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు ఏటీఎం సెంటర్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు.
భర్తను స్టేషన్ లో బంధించి.. భార్యపై కానిస్టేబుల్ లైంగిక దాడి.. దాచేపల్లిలో ఘటన
అందులో పలువురు దుండగులు డబ్బులు బయటకు వచ్చే ప్రాంతంలో ప్లాస్టర్ అతికించడం, సతీష్ ఆ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత రూ.5 వేలు తీసుకొని వెళ్లడం రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.