Asianet News TeluguAsianet News Telugu

మంచి నిర్ణయమే.. కానీ చాలా లేటైంది - అసదుద్దీన్ ఒవైసీ

ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) వెలువరించిన తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్ ఇవ్వడాన్ని తాను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. (Supreme Court struck down the Electoral Bonds scheme) ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు పెట్టారు.

AIMIM president Asaduddin Owaisi welcomes Supreme Court's decision to scrap electoral bonds scheme..ISR
Author
First Published Feb 16, 2024, 11:43 AM IST

ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. ఈ తీర్పు అధికార బీజేపీ తప్పును తెలియచేస్తోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ పై సుప్రీంకోర్టు తీర్పు మంచిదేనని, కానీ చాలా ఆలస్యమైందని చెప్పారు. ఈ నిర్ణయం ముందే వచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. 

నేడు భారత్ బంద్.. కారణమేంటంటే ?

ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడమే కాకుండా అపరిమిత కార్పొరేట్ ఫండింగ్ కు అనుమతించే సవరణను కూడా అని పేర్కొంది. ఇవి రాజ్యాంగ విరుద్ధమైతే, ఆర్టికల్ 19(1)(ఎ)ను ఉల్లంఘిస్తే 2017 నుంచి ఎన్నికల చట్టబద్ధత గురించి ఏం చెప్పాలి? 2017 నుంచి ఎన్నికల చట్టబద్ధత, పారదర్శకతపై అవి పెద్ద ప్రశ్నార్థకం కాదా? ఎన్నికల వాచ్ డాగ్ నివేదిక ప్రకారం 2022-23 సంవత్సరానికి జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాలు రూ.850.438 కోట్లు కాగా, అందులో రూ.719.858 కోట్లు ఒక్క బీజేపీకే వెళ్లాయి.’’ అని ఆయన పేర్కొన్నారు.

ఒక మైనారిటీ కోసం అధికార పార్టీ స్పష్టమైన 'బుజ్జగింపు' చేస్తోందని ఒవైసీ ఆరోపించారు. ప్రధాని ఉపన్యాసాలు, గత పదేళ్లు దీనికి నిదర్శనం అని తెలిపారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు కూడా చాలా ఆలస్యమైంది. ఇది త్వరగా రావాల్సింది. కానీ, అధికార ప్రభుత్వంలో తప్పేముందో సమర్థవంతంగా ఈ తీర్పు చెబుతోంది.

మహాలక్ష్మి ఎఫెక్ట్.. బస్సుల్లో సీట్ల అమరికను మార్చేసిన ఆర్టీసీ.. ఎందుకో తెలుసా ?

రాజకీయ పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్ ఇవ్వడాన్ని తాను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నానని, ఈ విషయంలో 2017లో ఎన్నికలపై స్టాండింగ్ కమిటీకి తాను సమర్పించిన వినతిపత్రంలో కూడా వివరించానని తెలిపారు. పేరులేని సంస్థలు, వ్యాపారాలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చగలిగితే రాజకీయ పార్టీలు ప్రజలను ఎందుకు ఆకర్షిస్తాయని ప్రశ్నించారు. 

ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. ఓటరు తమ ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే ఒక రాజకీయ పార్టీకి నిధులకు సంబంధించిన సమాచారం అవసరమని పేర్కొంది. ఈ పథకం అమలు కోసం చట్టాల్లో చేసిన మార్పులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం  స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios