ప్రజాస్వామ్యంలో చీకటి రోజులను చూస్తున్నామని శివసేన (యూబీటీ) నాయకుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రను ఎన్నిక కాని ప్రభుత్వం పరిపాలిస్తోందని ఆరోపించారు.
ఏక్ నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే గురువారం మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం చీకటి రోజులను చూస్తున్నామని అన్నారు. ప్రజలతో ఎన్నిక కాని ప్రభుత్వం, రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం మహారాష్ట్రను పాలిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడిందని ఆయన ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
పదకొండేళ్ల బాలిక కిడ్నాప్, హత్య... హంతకుడిని పట్టించిన మిస్డ్ కాల్..
పూణెలో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో సేన నాయకుడు సచిన్ భోసలేపై జరిగిన దాడిపై థాకరే వ్యాఖ్యానిస్తూ.. ఈ ఘటనలో రాష్ట్ర హోంమంత్రి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘గద్దర్ గ్యాంగ్ (రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ) దురుసుగా ప్రవర్తిస్తోంది. సచిన్ భోసలే భుజానికి గాయమైంది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర హోం మంత్రి డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను అరెస్టు చేయడంపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. ‘‘మనం ప్రజాస్వామ్యం చివరిలో ఉన్నాం. ఆయనను విమానం నుంచి దించిన తీరు ఆమోదయోగ్యం కాదు ’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం షిండేపై కూడా మండిపడ్డారు. షిండే మహారాష్ట్ర సీఎంనా లేక గుజరాత్ సీఎంనా అని ప్రశ్నించారు. టాటా-ఎయిర్ బస్, వేదాంత-ఫాక్స్ కాన్ అనే రెండు బహుళ కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్ కు తరలించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రిపుల్ తలాక్ పై కేరళ సీఎం పినరయి వ్యాఖ్యలను తిప్పికొట్టిన గవర్నర్ ఆరిఫ్
కొత్త ప్రభుత్వ నాయకత్వంలో ఎన్ని కంపెనీలు మహారాష్ట్రకు వచ్చాయో శ్వేతపత్రాలు తీసి చూపించాలని ఆదిత్య ఠాక్రే సవాల్ విసిరారు. ఎన్నో ఉపాధి అవకాశాలు గుజరాత్ కు తరలివెళ్లాయని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 17వ తేదీన ఉద్ధవ్ ఠాక్రే శిబిరంతో జరిగిన పోరులో షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించిన ఎన్నికల సంఘం ఆ పార్టీకి 'విల్లు బాణం' ఎన్నికల గుర్తును కేటాయించింది.
కాగా.. ఈ నిర్ణయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూడా గురువారం స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. ఒక సిద్ధాంతం, పార్టీ దేశంలో సోదరభావాన్ని నాశనం చేస్తున్నాయని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యవస్థపై ఇంతటి దాడి జరగలేదని తెలిపారు. నరేంద్ర మోడీ పాలనలో దేశంలోని రాజ్యాంగ సంస్థపై దాడి జరుగుతోందని విరుచుకుపడ్డారు. నేటి ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలను పని చేయడానికి అనుమతించడం లేదనీ తెలిపారు. దీని కోసం ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
