2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని టీఎంసీ ఎంపీ శతృఘ్న సిన్హా అన్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. 

2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విస్మరించలేమని టీఎంపీ ఎంపీ శతృఘ్న సిన్హా అన్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గేమ్ ఛేంజర్ గా అవతరిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చిన్నతనంలో టీ అమ్మారని తాను నమ్మడం లేదని సిన్హా అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీ.. 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు

“ఎవరు నాయకుడిగా ఉంటారో మేము చాలా కాలంగా వింటున్నాము. నెహ్రూ కాలం వరకు ఇదే ప్రశ్న వేసేవారు. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడం వ్యర్థం. ప్రధానమంత్రిగా తిరిగి రాకుండా ఎవరిని ఆపాలనే విషయంలో స్పష్టత ముఖ్యం.’’ అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని సమర్థుడైన" నాయకుడని సిన్హా అభివర్ణించారు. 

కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాను విమానం నుంచి దింపి.. అరెస్ట్, విడుదల, మధ్యంతర బెయిల్..

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విజయవంతమైన నాయకుడని, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో అద్భుతంగా పనిచేస్తున్నారని శతృఘ్న సిన్హా కొనియాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేశారు. అలాగే బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదయ్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. తేజస్వి యాదవ్ మంచి పనితీరు కనబరుస్తున్నారని, చాలా అనుభవం సంపాదించారని అన్నారు.

Scroll to load tweet…

ఆయనను బీహార్ భవిష్యత్తుగా చూస్తున్నారని శతృఘ్న సిన్హా తెలిపారు. సీఎం లేదా పీఎం కావడానికి అర్హత అవసరం లేదని, కేవలం మద్దతు మాత్రమే అవసరమని సిన్హా అన్నారు. తేజస్వీ యాదవ్ బీహార్ సీఎం పీఠంపై కన్నేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2023 మార్చిలో నితీష్ కుమార్ తేజస్వీకి పగ్గాలు అప్పగిస్తారని ఆర్జేడీ నేత విజయ్ కుమార్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. శివసేన వివాదంపై ఆయన మాట్లాడుతూ.. ఆట ఇప్పుడే ప్రారంభమైందని, సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు.