Raipur: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం నాడు ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Congress 85th Plenary Session: కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంతో ప్రారంభమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం నాడు ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. "కాంగ్రెస్ ప్రతి మహాసభలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మా సంస్థను ముందుకు తీసుకెళ్లింది. అక్కడ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో ఇప్పటికీ గుర్తుండిపోతాయి. రాబోయే కాలంలో నయా రాయ్ పూర్ మనకు మార్గం చూపే విధంగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం మాకు లభించింది" అని ఖర్గే ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తన 85వ ప్లీనరీ సమావేశాన్ని ఫిబ్రవరి 24 నుండి 26 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 'హాత్ సే హాత్ జోడో' పేరుతో నిర్వహిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని మేధోమథనం చేయడానికి 15,000 మంది ప్రతినిధులతో పాటు ప్రధాన పార్టీ నాయకులు ఇప్పటికే ఛతీస్‌గఢ్‌కు చేరుకోవడం ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర ద్వారా స్క్రిప్ట్‌ను రూపొందించిన విజయగాథ కోసం రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలను పార్టీ అభినందించడానికి సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ పోరుకు నాయకత్వం వహించాలని పార్టీ నేతలు కూడా ఆయనను కోరతారని భావిస్తున్నారు.
2024 లోక్ సభ ఎన్నికలకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ను రూపొందించే మూడు రోజుల సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుందనీ, బీజేపీని ఎదుర్కోవడానికి భావసారూప్యత కలిగిన పార్టీలతో ఎన్నికల పొత్తుపై వ్యూహాన్ని ఖరారు చేస్తుందని భావిస్తున్నారు. ప్రధానంగా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ప్లీనరీకి కాంగ్రెస్ అధిష్ఠానం హాజరుకానుండటంతో పాటు ఆయన నేతృత్వంలోని కొత్త కార్యవర్గానికి మార్గం సుగమం కానుంది. మూడు రోజుల సమావేశాల్లో తొలిరోజు వర్కింగ్ కమిటీ పాత్ర పోషిస్తున్న స్టీరింగ్ కమిటీ (కొత్త సీడబ్ల్యూసీ ఏర్పడే వరకు గత కమిటీని రద్దు చేశారు) ఈ ఉదయం 10 గంటలకు సమావేశమై అత్యున్నత నిర్ణాయక మండలికి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుందని అంతకుముందు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గతేడాది మే నెలలో రాజస్థాన్ లో జరిగిన చింతన్ శిబిర్ ఒక బ్లూ ప్రింట్ తో ముందుకు వచ్చింది. అయితే, ప్రస్తుతం జరగుతున్న రాయ్ పూర్ సమావేశంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న ఎన్నికలకు సంబంధించి ఎలా సిద్ధం కావాలనే దానిపై ప్రత్యేక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. రాయ్ పూర్ ప్లీనరీ సమావేశం ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలుకు నాంది పలుకుతుందని సీనియర్ జనరల్ సెక్రటరీ ఒకరు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంస్థాగత వ్యక్తి అనీ, ఆయన కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని, పార్టీని బలోపేతం చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టారని పార్టీ అధిష్ఠానం చెబుతోంది.
