మేం వారికి రాజకీయంగా అంటరానివాళ్లం - ప్రతిపక్షాల సమావేశానికి ఆహ్వానం అందకపోవడంపై ఏఐఎంఐఎం ఫైర్
తాము రాజకీయంగా విపక్షాలకు అంటరానివాళ్లుగా మారామని ఏఐఎంఐఎం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు. తమ పార్టీ కూడా బీజేపీని ఓడిచేందుకు ప్రయత్నిస్తోందని, కానీ తమకు విపక్ష కూటమి సమావేశానికి ఆహ్వానం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన విపక్షాల సమావేశానికి అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)ను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల సమావేశానికి అసదుద్దీన్ ఓవైసీ పార్టీని ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. లౌకిక పార్టీలుగా చెప్పుకునే 26 పార్టీలు తమను రాజకీయంగా అంటరానివారిగా చూస్తున్నాయని ఆరోపించారు.
విపక్షాల కూటమికి ‘ఇండియా’ అనే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన నితీష్ కుమార్.. ఎందుకంటే ?
సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు మమ్మల్ని పిలవలేదని, వారికి తాము రాజకీయ అంటరానివాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ‘‘ నితీశ్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రే, మెహబూబా ముఫ్తీ వంటి నేతలు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ ను దూషించారు. కానీ ఆయన కూడా బెంగళూరులో కూర్చున్నారు. 2024లో బీజేపీని ఓడించేందుకు మేము (ఎంఐఎం) ప్రయత్నిస్తున్నాం. కానీ వారు (ప్రతిపక్షాలు) అసదుద్దీన్ ఒవైసీని, మా పార్టీని విస్మరిస్తున్నారు’’ అని వారిస్ పఠాన్ మండిపడ్డారు.
ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (ఇండియా) అనే పేరుతో కూటమి ఏర్పాటు చేసేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు అంగీకరించడంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన రెండు రోజుల సంయుక్త సమావేశం మంగళవారం ముగిసింది. సమావేశం అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. గతంలో తాము యూపీఏగా ఉన్నామని అన్నారు. అయితే ఇప్పుడు 26 పార్టీలు కలిసి విపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టాయని అన్నారు. ఈ తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని తెలిపారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. కాంగ్రెస్ హమీలన్నీ బూటకమే - మాయావతి
2024 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు దేశంలోని 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు మంగళవారం బెంగళూరులో సమావేశమైన నేపథ్యంలో ఈ కూటమికి కొత్త పేరు ఖరారు అయ్యింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పేరును ప్రతిపాదించారని విడుతలై చిరుతైగళ్ కట్చి చీఫ్ తోల్ తిరుమావళవన్ తెలిపారు.
కాగా.. జూన్ 23 న పాట్నాలో విపక్షాలు సమావేశమైనప్పుడు అందులో 16 పార్టీలు మాత్రమే ఉన్నాయి. అయితే తాజా సమావేశానికి మరో 10 పార్టీలు ఎక్కువగా హాజరయ్యాయి. అయితే ఈ కూటమిలోని అన్ని ప్రధాన పార్టీలతో సహా 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రచార నిర్వహణ కోసం, నిర్దిష్ట సమస్యలను చేపట్టే వివిధ ఉప కమిటీల పనితీరును సమన్వయం చేయడానికి ఢిల్లీలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని 26 పార్టీల ప్రతినిధులు నిర్ణయించారు.
బ్రేకింగ్.. బెంగళూరులో భారీ ఉగ్రదాడి భగ్నం.. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇదిలా ఉండగా.. ఈ ప్రతిపక్షాల తదుపరి సమావేశం ముంబైలో జరగనుంది. అయితే తేదీన ఈ సమావేశం జరగనుందో ఇంకా స్పష్టత రాలేదు. ఆ సమావేశంలోనే 11 మందితో కూడిన సమన్వయ కమిటీని, సభ్యుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.