రెండు రోజుల భారత పర్యటన కోసం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ శనివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తీసుకురావడానికి తాను, ప్రధాని నరేంద్ర మోడీ అంకితభావంతో పని చేస్తున్నామని, దానికి కట్టుబడి ఉన్నామని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ అన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం అని, తాను ఇందులో వ్యక్తిగతంగా పాల్గొంటానని తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం స్కోల్జ్ శనివారం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ప్రధాని అయ్యేందుకే బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారు - అమిత్ షా

‘‘ భారతదేశం అపారమైన పురోభివృద్ధి సాధించింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇది చాలా మంచిది. నేను గతసారి భారతదేశాన్ని సందర్శించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మార్పు వచ్చింది. భారతదేశం నిజంగా అభివృద్ధి చెందుతోంది. నాకు, ప్రధాని మోడీకి ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి. మేము సహకరించుకున్నాం. అనేక విషయాలపై చర్చిస్తున్నాం. ఈ ఏడాది భారత్ కు జీ20 అధ్యక్ష పదవి దక్కడం సంతోషంగా ఉంది’’ అని స్కోల్జ్ పేర్కొన్నారు.

Scroll to load tweet…

‘‘మాకు ప్రతిభ అవసరం, మాకు నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలి. భారతదేశంలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగం పుంజుకుంటుంది. మంచి సామర్థ్యం గల కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో చాలా ప్రతిభ ఉంది. మేము ఆ కార్పొరేషన్ నుండి ప్రయోజనం పొందాలనుకుంటున్నాం. జర్మనీలో ఆ ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకుని ఆకర్షించాలనుకుంటున్నాం’’ అని అన్నారు. 

లోక్ సభ ఎన్నికల పొత్తులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

25,26 తేదీల్లో రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఆయన శనివారం భారత్ కు చేరుకున్నారు. 2011లో ఇరు దేశాల మధ్య ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ (ఐజీసీ) విధానం ప్రారంభమైన తర్వాత జర్మన్ చాన్స్ లర్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ తొలి వార్షికోత్సవం జరిగిన మరుసటి రోజే మోడీని స్కోల్జ్ కలిశారు.

Scroll to load tweet…

ఈ విషయాన్ని స్కోల్జ్ ప్రస్తావిస్తూ.. ‘‘ ఏడాది కాలంగా యుద్ధం కొనసాగుతోంది. ఇది చాలా విధ్వంసంతో కూడిన భయంకరమైన యుద్ధం.. ఇదొక పెద్ద విపత్తు’’ అని వ్యాఖ్యానించారు. ఈ దురాక్రమణతో ప్రపంచం ఇబ్బంది పడుతోందని తెలిపారు. కానీ ప్రపంచం ఒక మంచి ప్రదేశంగా మారడానికి మేము చేయగలిగినదంతా చేస్తామని చెప్పారు.

దావూద్ ఇబ్రహీం డీ కంపెనీపై ఎన్‌ఐఏ టార్గెట్.. దుబాయ్‌కు వెళ్లిన టీమ్

కాగా.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారత్, జర్మనీల సంబంధాలు రెండు దేశాల మధ్య లోతైన అవగాహనపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. ‘‘మాకు వాణిజ్య మార్పిడి చరిత్ర ఉంది. యూరప్‌లో జర్మనీ మా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి’’ అని ప్రధాని మోడీ సంయుక్త ప్రకటన చేస్తూ అన్నారు. ఇదిలా ఉండగా.. 2023 చివరి నాటికి చర్చలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈయూ, భారత్ గతేడాది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రూపొందించడానికి చర్చలను పునరుద్ధరించాయి.