ప్రధాని అవ్వాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. అధికారం కోసం లాలూ ఒడిలో కూర్చున్నారని, సోనియా గాంధీ పాదాల చెంత చేరారని విమర్శించారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని కావాలనే తన కోరికను నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్‌తో చేతులు కలిపారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జేడీ (యూ), ఆర్జేడీ బంధం చమురు, నీరు కలిసిన ‘అపవిత్ర కూటమి’ అని అన్నారు.బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని లౌరియాలో శనివారం జరిగిన ప్రచార ర్యాలీలో బీజేపీ మద్దతుదారులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. నితీష్ కు ఇక బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అన్నారు.
లోక్ సభ ఎన్నికల పొత్తులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
“జై ప్రకాష్ నారాయణ్ కాలం నుండి కాంగ్రెస్, 'జంగల్ రాజ్'కు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన తర్వాత నితీష్ కుమార్ లాలూ ఆర్జేడీ, సోనియా గాంధీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అధికారం కోసం నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ ఒడిలో కూర్చున్నారు. తిరిగి సోనియా గాంధీ పాదాల చెంతకు చేరారు. ఆయన తన ప్రధానమంత్రి ఆశయాల కోసం 'వికాస్వాది' (అభివృద్ధి అనుకూల) నుంచి 'అవసర్వాది' (అవకాశవాది) అయ్యాడు ‘ఆయారామ్, గాయరామ్’ చాలని, నితీశ్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి’’ అని అమిత్ షా అన్నారు.
దావూద్ ఇబ్రహీం డీ కంపెనీపై ఎన్‌ఐఏ టార్గెట్.. దుబాయ్‌కు వెళ్లిన టీమ్
తేజస్వి యాదవ్‌ను తదుపరి ముఖ్యమంత్రిని చేసేందుకు నితీష్ అంగీకరించారని, కానీ ఎప్పుడు ఆయన అలా చేయాలనుకుంటున్నారో ప్రకటించాలని, రాష్ట్రాన్ని ఎప్పుడు ‘జంగల్ రాజ్’లో ముంచెత్తుతారో చెప్పాలని అన్నారు. ప్రస్తుతం హాఫ్ జంగిల్ రాజ్ ఉందని, తేజస్వీ సీఎం అయిన తరువాత పూర్తి జంగిల్ రాజ్ అవుతుందని అమిత్ షా ఆరోపించారు. జంగిల్ రాజ్ నాయకత్వంలో నితీశ్ కుమార్ పని చేస్తారని చెప్పారు. నితీశ్, లాలూలు బీహార్‌ను వెనుకబాటు సుడిగుండం నుంచి బయటకు తీయలేరని ఆయన ఆరోపించారు. పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైందని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టోన్ సెట్ చేయవచ్చని తెలిపారు.
‘‘బీహార్‌ను విభజించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. మాట్లాడే జర్నలిస్టులను చంపేస్తున్నారు. మద్యపాన నిషేధంపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కల్తీ మద్యాన్ని అరికట్టాలి. మోడీ గొప్ప పనులు చేశారు. లాలూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు సమాధానం చెప్పలేదు. మోడీ వైమానిక దాడులు, సర్జికల్ దాడులు చేశారు.’’ అని అన్నారు.
భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది - సోనియా గాంధీ
ఆర్టికల్ 370 రద్దును లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, నితీష్ కుమార్ పార్టీ అయిన జేడీ (యూ) కూడా వ్యతిరేకించిందని అన్నారు. దాని వల్ల కాశ్మీర్‌లో రక్తపు నదులు ప్రవహిస్తాయని వారు చెప్పారని, కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఒక గులకరాయి వేయడానికి కూడా ఎవరూ సాహసించలేదని, ఇక్కడుంది మోడీ ప్రభుత్వం అని తెలిపారు. ఈ ర్యాలీలో అమిత్ షా అరగంట పాటు ప్రసగించారు.
